Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పూనమ్ ట్రయాంగిల్ లవ్

poonamవి.బి.ఆర్. క్రియేషన్స్, సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పూనమ్ పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటిస్తున్నారు. భవాని మస్తాన్ కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. కామెడీ ప్రధానంగా సాగే ట్రయాంగిల్ లవ్ చిత్రమిది. ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరో కూడా నటిస్తున్నారని నిర్మాతలు విజయ్‌భాస్కర్ రెడ్డి, ఫకృద్దీన్ షా తెలియజేశారు.

Comments

comments