Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పేదోడి యాపిల్ జామ

guavaసాధారణంగా తక్కువ ధరకు దొరికే వాటిపై మనం శ్రద్ధ పెట్టం. జామకాయల విషయానికొస్తే, వీటిని రోడ్ల మీద విరివిగా తక్కువ ధరకే అమ్ముతుంటారు. కానీ, వీటిని కొనడం అంతంత మాత్రమే. ఒక్కమాటలో చెప్పాలంటే పేదోడి యాపిల్‌గా జామ అని అంటుంటాం. యాపిల్‌లో ఉండే పోషకవిలువలు జామకాయలో ఉన్నాయని ఇదివరకే పరిశోధనలో తేలింది. కాలానుగుణంగా వచ్చే జామ ఆరోగ్యాన్ని చాలా చక్కగా కాపాడుతుంది. జామలో పీచు, విటమిన్ల్లు, ప్రోటీన్లూ బాగా లభిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంపొందించే విటమిన్ సి జామకాయల్లో అధిక మోతాదులో ఉంటుంది. ఇందులో ఉండే మెగ్నీషియం ఆందోళనను దూరం చేస్తుంది. విటమిన్ ఎ అధిక మోతాదులో ఉండడం వల్ల దృష్టిలోపాలు దూరమవుతాయి.
– ఇందులో ఉండే మిటమిన్లు ఎ, సి, ఫైబర్లు, ప్లవనాయిడ్లూ, బీటా కెరొటిన్, ల్యూటిన్లు క్యాన్సర్ కారకాలను నిరోధించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. క్యాన్సర్ కణతులు వ్యాప్తి చెందకుండా కాపాడతాయి. లోపల ఎర్రగా ఉండే రకం జామకాయలు క్యాన్సర్ నివారణలో మరింతగా తోడ్పడతాయి. వీటిలో ఉండే ఫైబర్ల మూలంగా డయాబెటిస్ నివారణలోనూ జామకాయలు ప్రధానపాత్ర పోషిస్తాయి. మలబద్ధకాన్నీ తొలగిస్తాయి. శరీరంలో సోడియం, పొటాషియం పరిమాణాన్ని సమపాళ్లలో ఉంచి రక్తపోటు అదుపులో ఉండేందుకు సాయపడతాయి. ఇన్ని రకాలుగా ఆరోగ్యాన్ని కాపాడే జామను తినడం మరువకండి.

Comments

comments