Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలి

meetingప్రతి ఫిర్యాదును పరిష్కరించాలి
– జోగులాంబ గద్వాల జిల్లా ఎస్‌పి రెమారాజేశ్వరి
మన తెలంగాణ/గద్వాల న్యూటౌన్: జోగుళాంబ గ ద్వాల జిల్లా సోమవారం గ్రీవేన్స్‌డే సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి 9 ఫిర్యాదులు వచ్చాయి. జి ల్లా ఎస్‌పి రెమారాజేశ్వరి ఫిర్యాదు దారులతో నేరు గా మాట్లాడి వారి సమస్యల ను అడిగి తెలసుకున్నా రు. భూమి వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు 3, కు టుంబం సమస్యలు 2, ఇతర గొడవల సంబం ధించిన ఫిర్యాదులు 1, ఇతర అం శాలపై 2, అబ్బా యి మిస్సింగ్ ఫిర్యాదుల 1, సమస్యలను సవధానం గా విన్న జి ల్లా ఎస్‌పి రేమారాజశ్వరి వాటిని పరిష్కరించవల్సిందిగా ఆయాశాఖల అధికారు లను డిఎస్పి, సిఐ, ఎస్‌ఐ లను ఆదేశించారు. మరియు సివిల్ ఫిర్యాదులను కోర్టు లో పరిష్కరించుకోవాల్సిందిగా వారికి సూచించారు.
ప్రజావాణి ఫిర్యాదులపై వెంటనే స్పందించండి
– జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ
మన తెలంగాణ/ గద్వాల అర్బన్: వివిధ సమస్యల పై వచ్చే ఫిర్యాదులను తప్ప కుండా పరిష్కరించాలని పెండింగులో ఉంచకుండా తగిన చర్యలు తీసుకోవా లని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ అన్నారు. సోమ వారం ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం బాధి తులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చారు. బాధితుల నుంచి 37 ఫిర్యాదులను కలెక్టర్ రజత్‌కు మార్‌సైనీ స్వీకరించారరు. అనంతరం వాటిని సం బంధిత శాఖల కు చెందిన అధికారులకు పంపించా రు. వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి చర్య లు తీసుకుని పరిష్కరించాలన్నారు. మొత్తం 46 ఫి ర్యాదులు వచ్చిన ట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ యా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి
– వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి
మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: ప్రజావాణి కార్య క్రమంలో భాగంగా సోమ వారం సుమారు 56 మంది వారి ఫిర్యాదులను సమర్పించారు. కలెక్టర్ శ్వేతామ హంతి తన చాంబర్‌లో ప్రజల వద్ద నుండి ఫిర్యాదుల ను స్వీకరించారు. జెసి నిరం జన్, జిల్లా అధికారులు ప్రజావాణి హాల్‌లో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీక రించారు. ఫిర్యాదులను ఎప్పటి కప్పుడు పరి ష్క రించేందుకు అధికారులు చర్చలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రీ వెన్స్ డే రోజున వచ్చే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఫిర్యాదుపై స్పందించా లని, ప్రజావాణికి అధికారులు తప్పకుండా హాజరుకావాలని సూచించారు.

Comments

comments