Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

యథేచ్ఛగా చెరువు భూమి ఆక్రమణ

Por cierto, la tierra del estanque ocupado

జేసిబితో మట్టిని తోడుతున్నా
పట్టించుకోని అధికారులు

మన తెలంగాణ/ ఖమ్మం అర్బన్: కార్పొరేషన్ పరిధిలోని మల్లేమడుగు రెవిన్యూలోని పెద్దచెరువును కొంతమంది ఆక్రమణదారులు యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. చెరువు ఆక్రమణకు గురవుతుందని అధికారులకు తెలిపినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఆక్రమణల కు గురైన చెరువు భూమిని కాపాడాలని రైతులు అధికారులకు విన్నవించారు. వివరాల్లోకి వెళితే … నగరంలోని 50వ డివిజన్ మల్లెమడుగు రెవిన్యూ పరిధిలోని సర్వే నెం.117, 118, 120, 235, 236, 237 సర్వే నెంబర్లలో 118 ఎకరాల్లో పెద్ద చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువుపై కొంత మంది అక్రమార్కుల కన్ను పడింది. దీంతో దాన్ని ఆక్రమించేందుకు పన్నాగం పన్ని సుమారు 18 ఎకరాల భూమిని ఆక్రమించుకుని దానిలో ఉన్న నీటిని కూడా యథేచ్ఛగా వాడుకుంటున్నారు. 119 సర్వే నెంబరు పట్టా భూమి అని, ఇది చెరువు భూమి కాదని చెప్పుకుని ఆక్రమించుకున్నారు. దీనిపై ఆయకట్టు రైతులంతా కలిసి అర్బన్ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా దానిపై మండలాధికారి సర్వే చేయించి అది చెరువు భూమి అని చెప్పినప్పటికీ అక్రమార్కులు అది పట్టా భూమి అంటూ ఆక్రమించుకుంటున్నారు. దీనికి సంబంధించి ఆయకట్టు రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా సర్వే అండ్ ల్యాండ్ ఏడిఈకి వ్రాయగా డిస్ట్రిక్ ఇన్‌స్పెక్టర్ ఇటీవల కొంత సర్వే నిర్వహించారు. పూర్తి స్థా యిలో వారం రోజుల్లో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ అక్రమార్కులు మాత్రం యథేచ్ఛగా ఆక్రమించుకున్న భూమిలో గత రెండు రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా మట్టి తవ్వకాలను చేపడుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తున్న ఆయకట్టు రైతులపై దౌర్జన్యానికి దిగుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి ఆక్రమదారుల నుంచి చెరువు భూమిని కాపాడి హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేకపోతే చెరువు మొత్తం ఆక్రమణ పాలవుతుందని వాపోయారు.

Comments

comments