Home జాతీయ వార్తలు పంచలోహ శివలింగం స్వాధీనం

పంచలోహ శివలింగం స్వాధీనం

SIVALINGAMవిజయవాడ : కోట్ల విలువ చేసే శివలింగాన్ని విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 87 వజ్రాలు పొదిగి ఉండడంతో పాటు ఐదు తలల నాగేంద్రుడు ఉన్న ఈ శివలింగం పురాతన విగ్రహంగా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి గురువారం రాత్రి కృష్ణలంక, రామలింగేశ్వనగర్, కేదారేశ్వరపేటకు చెందిన యార్కారెడ్డి నరసింహారెడ్డి, నరాల శెట్టి వెంకట దుర్గాప్రసాద్, కొల్లిపర శివనాగేంద్ర, పైడిముక్కుల వెంకన్నబాబు, చేజర్ల శ్రీనులను పోలీసులు అరెస్టు చేశారు. తమ వద్ద పంచలోహ విగ్రహం ఉందంటూ వాట్సాప్ ద్వారా అందరికీ సమాచారం పంపుతున్నారు. దీని విలువ ఎనిమిది కోట్ల నుంచి పది కోట్ల వరకు ఉంటుందని ప్రచారం చేశారు. ఈ క్రమంలో విజయవాడలోని ఓ వ్యక్తి రూ.1.50 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. ఆ శివలింగాన్ని తీసుకొని కేదారేశ్వరపేటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న విజయవాడ టాస్క్‌ఫోర్స్ ఎసిపి మురళీధర్, ఎస్‌ఐ సురేష్‌రెడ్డి సంఘటనాస్థలానికి వెళ్లి పట్టుకున్నారు. నిందితులు కృష్ణలంకలోని జ్యూయలరీ బార్ ఆర్ట్ పేరిట వ్యాపారం చేస్తున్నారని, పురాతన విగ్రహాల పేరిట అమ్మకాలు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.