Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఫ్లూటోతో పోస్టల్ స్టాంప్

PLUTOవాషింగ్టన్ : అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా ప్రయోగాలకు అరుదైన గుర్తింపు లభించనుంది. నాసా తీసిన ఫ్లూటో ఫొటోలతో అమెరికా ఈ ఏడాది పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది.  మరుగుజ్జు గ్రహం ఫ్లూటోకు అతిదగ్గరగా ఇటీవల నాసా న్యూహారిజాన్‌ను పంపింది. న్యూహారిజాన్ తీసిన ఫొటోలను నాసా ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. అందులో అతిదగ్గరగా తీసిన ఓ ఫొటోతో అమెరికా పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. వీటితో పాటు పౌరవ్యవస్థలోని కొన్ని గ్రహాలు, నక్షత్రాలతో కూడా స్టాంపులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మే చివర్లో న్యూయార్క్‌లో జరిగే స్టాంప్ షోలో ఈ స్టాంపులను ప్రదర్శించనుంది.

Comments

comments