Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఉత్తరప్రదేశ్‌లో పోస్టర్ల వివాదం

NITISHKUMAR3లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్‌లో పోస్టర్ల వివాదం కొనసాగుతోంది. ఇటీవల యూపీ బిజెపి అధ్యక్షుడు కేశవ్ మౌర్యను కృష్ణుడిగా, ప్రతిపక్షాలను కౌరవులుగా చిత్రిస్తూ ముద్రించిన పోస్టర్‌పై రాజకీయ దుమారం రేగింది. తాజాగా బిహార్ సిఎం నితీశ్‌కుమార్‌ను నరసింహస్వామిగా చిత్రిస్తూ వెలసిన పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు విమర్శలకు కూడా దారితీస్తోంది. ఆది శేషుడిపై కూర్చుని లిక్కర్‌ను చిదిమేస్తూ , అవినీతి, అసమర్థపాలనను పాదాలతో తొక్కుతూ ఉన్నట్లు ఈ పోస్టర్‌ను రూపొందించారు. దీనిపై జేడీయూ అధికార ప్రతినిధి అమిత్ స్పందించారు. ఆ పోస్టర్‌కు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. తాము ఇలాంటి ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించమని, ఇది వారి వ్యక్తిగత అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు.

Comments

comments