Home తాజా వార్తలు విజయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

విజయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

Vijay-Sai

హైదరాబాద్: టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి సోమవారం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొద్దిసేపటి క్రితం విజయ్ మృతదేహానికి ఉస్మానియా వైద్యలు పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆ తర్వాత విజయ్ మృతదేహాన్ని యూసుఫ్‌గూడలోని ఆయన నివాసానికి తరలించారు. మంగళవారం సాయంత్రం కూకట్‌పల్లి ఇఎస్‌ఐ శ్మశానవాటికలో విజయ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆస్పత్రిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విజయ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Postmortem completed to comedian vijay Deadbody in Osmania Hospital.