Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి

Pregnant

హైదరాబాద్ : పాతబస్తీలోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో బాలింత కన్నుమూసింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు బాలింతలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. కాగా మృతురాలు మహబూబ్ నగర్ కు చెందిన రత్నమాలగా గుర్తించారు. వరుసగా నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలింతలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కాగా ఆస్పత్రులలో సేవాలోపం కారణంగా వీరు చనిపోయినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఉస్మానియా ఘటనపై ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది.

Comments

comments