Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

జంట పేలుళ్ల కేసులో తీర్పు వాయిదా

Postponed the Judgment in Twin Blasts Cases

హైదరాబాద్ : హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో తీర్పును వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి జైల్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు శిక్షను ఖరారు చేయనుంది. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌లో జంట పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుళల్లో 44 మంది చనిపోయారు. 68 మంది గాయపడ్డారు. మొదట లుంబినీ పార్కులో పేలుడు సంభవించింది. ఇక్కడ జరిగిన పేలుళ్లలో 12 మంది చనిపోయారు. 15 నిమిషాల తేడాతో కోఠిలోని గోకుల్‌చాట్‌లో పేలుడు సంభవించింది. ఇక్కడ జరిగిన పేలుడులో 32 మంది చనిపోయారు. ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ పాల్పడినట్టు విచారణ అధికారులు ధృవీకరించారు. ఈ రెండు పేలుళ్లపై మొదట సిట్ అధికారులు విచారణ చేపట్టారు. అనంతరం అక్టోపస్ ఈ కేసును విచారించింది. ఈ కేసులో కొందరు నిందితులు పరారీలో ఉండగా, ఐదుగురు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు.

Postponed the Judgment in Twin Blasts Cases

Comments

comments