Home తాజా వార్తలు భాగ్యనగరంలో కుంగిన రోడ్డు!

భాగ్యనగరంలో కుంగిన రోడ్డు!

Potholes on the road in Hyderabad

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లోని షాపూర్ నగర్-జీడిమెట్ల ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ఇక్కడ ఇటీవలే గోదావరి పైప్‌లైన్ వేశారు. ఆ సమయంలో పైప్‌లైన్ కోసం తీసిన గుంతలను సరిగ్గా పూడ్చకుండా రోడ్డు వేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల సిఐ శంకర్‌రెడ్డి, ట్రాఫిక్ ఎస్‌ఐ రమేష్ అక్కడకు చేరుకుని వాహనదారులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. రోడ్డు కుంగిన చోట తాత్కాలిక డివైడర్లను ఏర్పాటు చేశారు.