Home తాజా వార్తలు పేదవాడి ఫ్రిజ్‌లకు భలే గిరాకి

పేదవాడి ఫ్రిజ్‌లకు భలే గిరాకి

తక్కువ ధరల్లో ఎక్కువ పనితనం

ప్లోరైడ్‌ను సైతం అరికడుతున్న మట్టి కుండలు

కుండలపైన మక్కువ చూపుతున్న వినియోగదారులు

 

మనతెలంగాణ/చర్లపల్లి: నగరంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఎండలతో ప్రజలు దాహం తీర్చుకునేందుకు పేదవాడి ప్రీజ్‌లుగా పిలుచుకునే మట్టికుండలు, రంజన్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్‌లో మట్టికుండలకు గిరాకి పెరుగుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యేకంగా కుండలు, రంజన్‌ల దుకాణాలు వెలిశాయి. మార్కెట్‌లో లభ్యమయ్యే మట్టి కుండలు వేసవిలో సామన్యులకు ఎంతో ఉపశమనం కల్గిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు ముప్పాయి డిగ్రీలు దటడంతో మట్టి కుండల వాడకం మరింత పెరుగుతున్నాయి. మట్టి కుండలు చల్లని రుచికరమైన నీటితో ప్రజల దాహర్తిని తీరుస్తు ప్రజాభిమానాన్ని చూరగొంటున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి పేదవాడి ప్రీజ్‌లుగా గుర్తింపు పొందాయి. మట్టికుండలు గత ఎడాదితో పోలిస్తే వాటి ధరలు మరింత పెరిగాయి. చిన్న సైజ్ కుండలు గత ఎడాది 80 రూపాయలు ఉండగా ఈఎడాదిగా 150కి చేరాయి. ఇక పెద్ద సైజ్ కుండలు వంద రూపాయాలు ఉండగా ఈ సారి 200 వరకు పెరిగాయి. రానురాను నగరంలో కుండలు చేసేవారు లేక నగర పరిసర గ్రామల నుంచి కుండలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు కుండల తయారీదారులు వివిద సైజ్‌లో పాటు కుండలకు, రంజన్‌లకు అందమైన రంగులు వేసి ప్రత్యేకంగా ట్యాప్‌లు బిగించి వాడుకునేందుకు సౌలభ్యంగా తీర్చిదిద్దుతున్నారు.

ముడిసరుకు ధరలు పెరిగాయి: అంజనేయులు కుండల తయారీదారుడు

మట్టి కుండలు తయరు చేసేందుకు ఉపయోగించే ముడిసరుకు ధరలు పెరిగాయి పైగా మట్టి కుండలకు ఎండకాలంలో తప్పి మార్కెట్ లేకపోవడంతో రానురాను నగరంలో కుండలు తయారుచేసేవారు కరవుతున్నారు. దీంతో నగర పరిసర గ్రామల నుంచి కుండలను తీసుకువచ్చి విక్రయిస్తుండటంతో గత్యంతరం లేక ధరలు పెంచాల్సివస్తుందని కుండల వ్యాపారి అంజనేయులు అంటున్నారు. పెరిగిన ధరలు వినియోగదారులకు అందుబాటులోనే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ముందు ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరగనుండటంతో వ్యాపారం ఊపందుకుంటుందని వ్యాపారులు ఆశభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మట్టి కుండలు ఫ్లోరైడ్‌ను అరికడుతుంది: ప్రభాకర్‌రెడ్డి వినియోగదారుడు

మట్టికుండలు తక్కువ ధరలకే లభ్యం కావడం, ఆరోగ్యపరంగా ఫ్రిజ్‌లతో పోలిస్తే కుండలో నీరు త్రాగడం వల్ల నీటిలోని ప్లోరైడ్‌ను కుండలు పిల్చీ కమ్మటి మట్టి వాసనతో కూడిన రుచికరమైన నీటిని అందిసుంది. పైగా ఫ్రిజ్‌లోని నీరు త్రాగాడం వల్ల వేడి చేసే ప్రమాదముంది కుండలతో ఆ ప్రమాదం ఉండదని వినియోగదారుడు ప్రభాకర్‌రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు మార్కెట్ లబించే కుండలు అకర్షనియమైన రంగులతో పాటు వాడుకునేందుకు సౌలభ్యంగా ఉండేందుకు ట్యాప్‌లు బిగించి ఇస్తున్నారు.

Pots Sale in Summer Session in Telangana