Home జాతీయ వార్తలు మళ్లీ పేదరికం లెక్కలు!

మళ్లీ పేదరికం లెక్కలు!

Povertyపేదరిక నిర్మూలనకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పగారియా నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ దారిద్య్రరేఖను నిర్ధారించాలనే ప్రతిపాదించనున్నది. దీని ద్వారా, సమాజంలో అట్టడుగున ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు ఏ మేరకు మేలు చేస్తున్నాయనే అంచనా వేయవచ్చని అది అభిప్రాయపడింది. అయితే, ఈ టాస్క్‌ఫోర్స్ పేదల సంఖ్య ఎంత అనే లెక్కల జోలికి వెళ్లకపోవచ్చని భావిస్తున్నారు. ఇటీవల సామాజి కార్థిక కుల గణన (సెక్) వెల్లడి చేసిన గణాంకాలను ప్రభుత్వ పథకాలు, సబ్సిడీల కోసం వినియోగించుకోవచ్చుననే చర్చ కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఉంది. గ్రామీణ ప్రాంత గణాంకాల్ని మాత్రమే వెల్లడి చేసిన సెక్, పట్టణ ప్రాంత లెక్కల్ని ఇంకా వెల్లడి చేయాల్సి ఉంది. దారిద్య్రరేఖకు సంబంధించిన నిర్ధారణతో ప్రభుత్వ పథకాలను మెరుగుపర్చడానికి అవకాశం ఉందని ఈ టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా ఉన్న అధికారులు భావిస్తున్నారు.

ఈ టాస్క్‌ఫోర్స్ గడువు జూన్ నెలలోనే ముగియాల్సి ఉండింది. అయితే దీనిని ఆగస్టు చివరి దాకా పొడిగించారని ఒక అధికారి తెలిపారు. మరి కొద్ది వారాల్లో ఈ టాస్క్‌ఫోర్స్ తన సిఫారసులను వెల్లడి చేయవచ్చు. మాజీ ప్రధా న గణాంకవేత్త ప్రణొబ్ సేన్ నేతృత్వంలో జాతీయ గణాంకాల కమిషన్ దా రిద్య్రరేఖను నిర్ధారిస్తుందని అధికారులు అంటున్నారు. పేదరికాన్ని తగ్గించ డానికి స్థిర ఆర్థికాభివృద్ధిలో ఏయే అంశాలు అనివార్యమనేది నీతి ఆయోగ్ టాస్క్‌ఫోర్స్ నిర్ధారిస్తుంది. పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వ జోక్యంతో పాటు కుటుంబ స్థాయిలో సబ్సిడీల అవసరాన్ని ఇది నొక్కి చెప్పబోతున్నది.

గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రానికి సంబంధించిన పలు వివరాలను సెక్ గణాంకాలు విస్పష్టంగానే పేర్కొన్నాయి. కాబట్టి పేదరికాన్ని లెక్కించడానికి వేరే ప్రమాణం ఏదీ అవసరం లేదనే అభిప్రాయం కూడా టాస్క్‌ఫోర్స్ నివేది కలో ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే, జాతీయ పేదరిక సం ఖ్యను నిర్ధారించడం అవసరమనే అభిప్రాయమే టాస్క్‌ఫోర్స్‌లో బలంగా ఉంది. అయితే ఈ లెక్కలు ఎవరు చేయాలన్న విషయం జోలికి టాస్క్‌ఫోర్స్ వెళ్లదల్చుకోలేదని తెలుస్తోంది. మునుపటి ప్రణాళికా సంఘం దారిద్య్ర రేఖ ను లెక్కించే కొలమానాల విషయంలో పలు మార్లు అభాసు పాలైన విషయం తెలిసిందే. వివిధ రంగాల నుంచి వ్యతిరేకత ఎదురవడంతో అది తన లెక్కలను సవరించుకోవల్సి వచ్చింది. ఈ టాస్క్‌ఫోర్స్‌లో అరవింద్ పనగారి యాతో పాటు నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్‌రాయ్, నిపుణులు రథిన్ రాయ్, సుర్జిత్ భల్లా, ప్రభుత్వ ప్రధాన గణాంకవేత్త టిసిఎ అనంత్ ఉన్నారు.

పేదరికం లెక్కల్లో ఎప్పుడూ తప్పులే
గతంలో ప్రణాళికా సంఘం ప్రతి ఐదేళ్లకోసారి దారిద్య్రరేఖకు దిగువన జీవించే ప్రజల శాతాన్ని ప్రకటించేది. అందు కోసం అది జాతీయ శాంపిల్ సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) ఫలితాలపై ఆధారపడేది. 2012లో యుపిఎ-2 పాలనా కాలంలో ప్రణాళికా సంఘం పేదరికానికి నిర్వచనాన్నిచ్చింది. పట్టణ ప్రాంతంలో రోజుకు రూ. 28.65 పై., గ్రామాల్లో రూ. 22.42 పై. ఖర్చు చేసే వ్యక్తులెవ్వరూ పేదలు కారని మాంటె క్‌సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని కమిటీ ప్రకటించింది. దీనిపై పార్లమెంటు ఉభయ సభ ల్లో తీవ్ర స్థాయిలో దుమారం లేచింది. అహ్లువా లియాను పదవిలోంచి తప్పించాలని కూడా ప్రతి పక్షాలు డిమాండ్ చేశాయి. 2004-05 నుంచి 1009-10 మధ్య పేదరికం 7 శాతం తగ్గిందని, దారిద్య్రరేఖ ప్రమాణం కూడా తగ్గిందని సంఘం ప్రకటించింది. పేదరికం తగ్గిందని, పేదల సంఖ్య తక్కువగా ఉందని తప్పుడు లెక్కలు చూపి, ప్రజల ను మోసం చేస్తున్నారని ఆనాడు ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అధికారికంగా భారతదేశంలో 37 శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉందని చెబుతున్నారు.
కొలమానాలేవి?
పేదరికం గురించిన చర్చలో రెండు అంశాలు కీలకంగా ఉంటాయి. ఎంత మంది ప్రజలు పేదరికంలో ఉన్నారు? ఎవరెవరు? సాధారణంగా కనిపించే ఈ ప్రశ్నలకు జవాబులు వెతకడానికి వేర్వేరు పద్ధతులు ఉన్నాయి. పేదల సంఖ్యపై నిర్ధారణకు రావడం కోసం శాంపిల్ సర్వే చేస్తే సరిపోతుంది. అయి తే వారిని గుర్తించాలంటే మాత్రం ఇల్లిల్లూ తిరగాల్సిందే. ప్రస్తుతం అమలు లో ఉన్న పద్ధతి ప్రకారం, పేదరికాన్ని లెక్కగట్టడానికి ఒక వ్యక్తికి రోజూ ఎన్ని కేలరీల భోజనం లభిస్తున్నది అనే దాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నారు. దాని ద్వారా ఆ వ్యక్తి పేదరికం శ్రేణిలోకి వస్తాడా, రాడా అని అంచనా వేస్తా రు. అయితే ఈ కొలమానం సరికాదని విశ్లేషకుల అభిప్రాయం. కేవలం తిం డి కొలతతోనే పేదరికాన్ని నిర్ధారించలేమని వారి అభిప్రాయం. కొందరికి స రైన బట్టలు లేకపోవచ్చు, ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు, అయినా ఎక్కడైనా ధర్మసత్రాల్లో ఉచితంగా లభించే ఆహారం తినడం వల్ల వారికి తగినన్ని కేల రీలు లభిస్తుండవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి విద్య, విద్యాభ్యాసానికి అవకాశాలు, తొడుక్కునే బట్టలు, బతికే విధానం, ఉండడానికి ఇల్లు వంటి అంశాలను కూ డా పరిగణనలోకి తీసుకుంటే తప్ప పేదరికాన్ని వాస్తవికంగా కొలవలేమని వారి అభిప్రాయం.
పేదరికం టాస్క్‌ఫోర్స్
పేదరిక నిర్మూలనకు నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్, ఒక నిర్దిష్ట కాలంలో పేదరికాన్ని విశ్లేషించడానికి దారిద్య్ర రేఖను వినియోగించాలని సిఫారసు చేయనున్నది. ఇది పేదలకు వనరుల కేటాయింపును మెరుగు పర్చడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. పేదరికాన్ని త్వరగా నిర్మూలించడానికి కుటుంబాల ప్రాతిపదికన సబ్సిడీలను కూడా టాస్క్‌ఫోర్స్ ప్రతిపాదించవచ్చు.  దారిద్య్ర గణనను నీతి ఆయోగ్‌కు గానీ, జాతీయ గణాంకాల కమిషన్‌కు గానీ అప్పగించే అవకాశం ఉంది.  ఆయోగ్ ప్రస్తుతం ఉన్న 1000 మంది సిబ్బందిని వచ్చే ఆరు నెలలలో 600కు కుదించే పథకంతో ఉంది.  ప్రైవేటు రంగం నుంచి కన్సల్టెంట్లను వేతనానికి కుదుర్చుకోవడమే కాకుండా అధికారికంగా సలహాదారుల్ని కూడా రిక్రూట్ చేసుకుంటారు. గ్రామీణ పేదరికానికి మరిన్ని సంస్కరణలు మందుకాదు

దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై 25 ఏ ళ్లు కావస్తోంది. ఈ కాలంలో గ్రామీణ ప్రాం తం లో పేదరికం తగ్గలేదు. అది తగ్గిపోయిం దం టూ ఇప్పటి దాకా చేసిన అధ్యయ నాలను, రిపోర్టులన్నింటినీ సెక్ రిపోర్టు తప్పని రుజువు చేసిందని పరిశోధకుడు, రచయిత దేవిందర్ శర్మ అభిప్రాయపడ్డారు. మార్కెట్ ఆర్థికశాస్త్రం ప్రకారం అభివృద్ధి రేటు పెరిగితే పేదరికం తగ్గుముఖం పడుతుందని చెబుతారు. కానీ ఇది నిజం కాదు. గత పదేళ్ల కాలంలో సగటు వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంది. కానీ పేదరికం మాత్రం తగ్గలేదు. గ్రామీణ ప్రజలు వ్యవసాయ రంగం నుంచి నిష్క్రమించడం, వారు మౌలి క వసతుల ప్రా జెక్టులలో కూలీ పనుల కోసం పట్టణాల బాట పట్టడం ఉపాధికల్పన అని పించు కోదు.

పంచవర్ష ప్రణాళికలన్నీ పేదరికాన్ని నిర్మూలించడం లో విఫలమ య్యాయని చెప్పక తప్పదు. వ్యవసాయ రంగాన్నే తీసు కుంటే, 52 శాతం, అంటే 60 కోట్ల మంది ఈ రంగంలో ఉన్నారు. వీరి కోసం 11వ పంచవర్ష ప్రణాళికలో రూ. ఒక లక్ష కోట్లు కేటా యించారు. 12వ పంచవర్ష ప్రణాళికలో రూ. 1.5 లక్షల కోట్లు కేటాయించారు. అంటే పదేళ్ల కాలంలో 60 కోట్ల మంది జీవితాలతో ముడిపడిన ఈ కీలక రం గంపై ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం రూ. 2.5 లక్షల కోట్లు. ఇది చాలా స్వల్పం. ఇదే కాలంలో పరిశ్రమా రంగానికి ప్రభుత్వం రూ. 42 లక్షల కోట్లు పన్నుల్ని మినహాయించింది. ఈ డబ్బును పరిశ్రమాధిపతుల నుం చి వసూలు చేసి గ్రామీణాభివృద్ధి కోసం ఖర్చు పెడితే పేదరికాన్ని 84 ఏళ్ల పాటు దరిదాపుల్లోకి కూడా రాకుండా అరికట్టవచ్చని దేవిందర్ అంటారు.