Search
Saturday 21 July 2018
  • :
  • :

పేదరిక నిర్మూలన బిజెపితోనే సాధ్యం

lkmn

జన చైతన్య యాత్ర సభలో బిజెపి నేతలు

మన తెలంగాణ/ వరంగల్ బ్యూరో : పేదరిక నిర్మూలన బి జెపితోనే సాధ్యమని బిజెపి జాతీ య నేత మురళీధర్‌రావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మన్ అన్నారు. బిజెపి నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలో భా గంగా గురువారం సాయంత్రం హన్మకొండ కెడిసి మైదానంలో బిజెపి అర్బన్ జిల్లా అధ్యక్షురా లు రావు పద్మ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తేవాల్సిన అవసరముందని అన్నారు. దేశాభివృద్దికి బిజెపి కృషి చేస్తోందన్నారు. రైతును రాజును చేసేందుకు అనేక చర్యలు చేపడుతుందన్నారు. అవినీతి రహిత పాలన చేస్తుందని తెలిపారు. తెలంగాణలో ప్రజలు ఆశించిన దానికి భిన్నమైన పాలన సాగుతుందని ఆరోపించారు. కేసిఆర్ ప్రభుత్వం అభూపకల్పనలతో పాలన చేస్తోందని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులు ఏమౌతున్నాయో అర్థం కాని పరిస్థితి తెలంగాణలో నెలకొందని ఆరోపించారు.బిజెపి పాలిత ప్రాంతాలలో ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు కూడా అన్ని రకాలుగా అభివృద్ది కావడంతో పాటు అనందంగా జీవితాలు కొనసాగాలంటే బిజెపిని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్ విధానాలు ప్రజలకు ఏమాత్రం మేలు చేయవని, రాష్ట్రంలోనూ కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలతో ప్రజలకు ప్రయోజనం లేదని అన్నారు. వరికి మద్దతు ధర పెంచి రైతును రాజును చేసేందుకు మోదీ సర్కార్ సిద్దపడిందని ఉద్ఘాటించారు. జై కిసాన్, జై జవాన్ అనే నినాధాలను మోడీ ప్రభుత్వం నిజం చేసి చూపిస్తోందని తెలిపారు. ఈ సభలో బిజెపి జాతీయ, రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొన్నారు.

Comments

comments