Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

శృతిహాసన్‌కు పవన్ క్లాస్..!?

Pawan-with-Shrutihassan

శృతిహాసన్ దక్షిణాదిలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది. కెరీర్ ప్రారంభంలో వరుస ప్లాపులతో సతమతమైన శృతి, గబ్బర్‌సింగ్ మూవీతో తొలి హిట్‌ను అందుకుంది. ఇక అప్పటి నుంచి శృతి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస ప్లాపుల స్థానంలో వరుస విజయాలు వచ్చి చేరాయి. ‘గబ్బర్‌సింగ్’ మూవీ తర్వాత పవన్, శృతి జంట కలిసి నటించలేదు.

చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం పవన్‌తో ‘కాటమరాయుడు’ మూవీలో శృతి నటిస్తోంది. రెండోసారి ఈ జంట ప్రేక్షకులను కనువిందు చేయనుంది. అయితే మొదటి సినిమాతో పోల్చుకుంటే ఇప్పుడు పవన్‌తో శృతి బాగా క్లోజ్ అయిందట. దీంతో మూవీ సెట్‌లో పవన్‌తో అన్ని విషయాలు మాట్లాడుతోందట. ఈ క్రమంలో తాను దక్షిణాది సినిమాలకు దూరమవ్వాలనుకుంటున్నట్లు పవన్‌కు చెప్పిందట శృతి. దాంతో పవన్ కొంచెం సీరియస్ అయిపోయి శృతికి క్లాస్ పీకాడట.

బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమా ఎంతో గొప్పదని, గతంలో ఎంతోమంది కథనాయికలు బాలీవుడ్‌లో స్టార్లుగా ఎదిగినప్పటికీ దక్షిణాది మూవీస్‌లో నటించడం మానలేదని చెప్పుకొచ్చారట. చిత్రసీమలో సుదీర్ఘకాలంపాటు హీరోయిన్‌గా కొనసాగలనుకుంటే దక్షిణాది సినిమాలను నెగ్లెక్ట్ చేయకూడదని హితబోధ చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బాలీవుడ్ చిత్రసీమలో ఉన్న లోపాలను కూడా శృతికి పవన్ వివరించాడట. దీంతో ప్రస్తుతం శృతిహాసన్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. పవన్ సలహాతో శృతి ఎలాంటి నిర్ణయానికి వస్తుందో చూడాలి.

Comments

comments