Home తాజా వార్తలు వ్యవసాయానికి 24 గంటల కరెంట్: కడియం

వ్యవసాయానికి 24 గంటల కరెంట్: కడియం

                   Kadiyam-Srihari

హైదరాబాద్: దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలవడం సిఎం కెసిఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనమని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని ప్రశంసించారు. త్వరలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వాలు విద్యా ప్రమాణాలను దిగజార్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాను సమిష్టిగా అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రారంభమైందని కడియం స్పష్టం చేశారు.