Home రాష్ట్ర వార్తలు పెరగనున్న విద్యుత్ డిమాండ్

పెరగనున్న విద్యుత్ డిమాండ్

రబీ సీజన్‌లో 10 వేల మెగావాట్లకు చేరే అవకాశం 

powerహైదరాబాద్: రబీ సీజన్‌లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. డిమాండ్ 10,000 మెగావాట్లకు అటూ ఇటూగా ఉంటాయని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కువగా బోరుబావుల పైనే రైతులు ఆధారపడుతారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భూగర్భ జలాలు ఆశాజనకం గా పెరిగాయి. దీంతో ప్రస్తుత పరిస్థితులలో భారీ గా వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి రైతులకు 9 గంటల విద్యుత్‌ను అంతరాయం లేకుండా సరఫరా చేస్తోంది. 7 గంటల విద్యుత్ కాస్తా ఏకంగా రెండు గంటలు పెంచడంతో విని యోగం పెరిగింది. తెలంగాణలో మొత్తం సుమా రుగా 22 లక్షల వరకు వ్యవసాయ విద్యుత్ పంపు సెట్లు అధికారికంగా నడుస్తున్నాయి. అనధి కారికంగా నడుస్తున్న పంపుసెట్లు దీనికి అదనం. వ్యవసాయ డిమాండ్ పెరగడంపై ఓ అంచనాకు వచ్చిన డిస్కంలు, విద్యుత్‌ను సమకూర్చుకునే పనిలో పడ్డాయి. భారీ వర్షాల కారణంగా నాగా ర్జునసాగర్ మినహా మిగతా రిజర్వాయర్లకు జల కళ వచ్చింది. దీంతో జూరాల, శ్రీశైలంలో అవస రానికి తగ్గట్లుగా జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే సౌలభ్యం ఉంది. ఇప్పటికే ఉన్న జెన్‌కో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు తోడుగా సింగరేణి థర్మల్ ప్లాంట్లు కూడా ఉత్పత్తికి సిద్ధమయ్యాయి. ఖరీఫ్‌లో ఆగస్టులో వర్షం లేక పంటలు దెబ్బతినడం, సెప్టెంబరులో అధిక వర్షాలతో బతికిన పంటలు చెడిపోవడంతో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పరిణామాలతో రబీ సీజన్‌లో పంటలను ముంద స్తుగా వేస్తారు. ఫలితంగా డిమాండ్ భారీగా పెరుగుతోంది. గత రెండేళ్లలో వరుస కరువుతో, భూగర్భ జలాలు  తగ్గిపోయి. పంటల విస్తీర్ణం తగ్గింది. ఇందులో వరి నాటే వారి సంఖ్య స గానికి పైగా తగ్గింది. ఇప్పుడు వర్షాలతో వరి సాగుకే ఎక్కువగా మొగ్గు చూపుతారు. రాష్ట్రవ్యాప్తంగా 2582 గ్రామీణ ఫీడర్లు ఉన్నాయి. ఇందు లో దాదాపుగా 95 శాతం ఫీడర్లకు 9 గంటల విద్యుత్‌ను ఇప్పటికే సరఫ రా చేస్తున్నారు. దీంతో సుమారుగా 100 మిలియన్ యూనిట్ల వరకు వ్య వసాయానికి సరఫరా చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ కేంద్రంగా ఉ న్న టిఎస్ ఎస్‌పిడిసిఎల్ కంటే వరంగల్  కేంద్రంగా ఉన్న టిఎస్ ఎన్ పిడి సిఎల్ పరిధిలో వ్యవసాయ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుం ది. ఎన్‌పిడిసిఎల్ విద్యుత్ వినియోగంలో 80 శాతం వ్యవసాయం, గృహ వి నియోగదారులే ఉంటారు. పారిశ్రామిక వినియోగం చాలా  తక్కువగా ఉంటుంది. అయితే ఎస్‌పిడిసిఎల్ పరిధిలో వ్యవసాయంతో పాటు వాణి జ్య, పారిశ్రామిక వినియోగం కూడా ఎక్కువగా ఉం టుంది. ఏడు గంట ల విద్యుత్‌ను 9 గంటలకు పెంచడంతో మౌళిక వస తుల కల్పనపై డి స్కంలు ప్రత్యేక శ్రద్ధ చూపాయి. సుమారుగా రూ.2 వేల కోట్ల తో లైన్లను, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేశారు. డిమాండ్ పెరిగి తే, అందుకు తగ్గట్లుగా కరెంటు సరఫరా లైన్ల సామర్ధం పెరగాల్సి ఉం టుంది. ఇదిలా ఉండగా శనివారం విద్యుత్ డిమాండ్ 126.6 మిలియన్  యూనిట్లుగా నమోదైంది. ఇందులో జెన్‌కో ధర్మల్ ప్లాంట్ల ద్వారా 35.6 ఎంయులు, హైడల్ ద్వారా 15.3 ఎంయులు సమకూరాయి. సింగరేణి ధ ర్మ ల్ ప్లాంట్ల నుంచి 8.9 ఎంయులు రాగా, కేంద్ర విద్యుత్ సంస్థలు, ఇ తరత్రా కొ నుగోళ్లతో 28.6 ఎంయుల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ సంస్థల నుంచి 18.6 ఎంయులు వచ్చింది. శనివా రం పీక్ సమయంలో 5754 మెగావాట్ల డిమాండ్ నమోదైంది.