Home తాజా వార్తలు ప్రేమగా చూస్తున్నారు

ప్రేమగా చూస్తున్నారు

బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తుండడం విశేషం. ఇదిలాఉండగా ‘సాహో’ చిత్రం నుంచి ఓ ఫొటో లీక్ అయింది. ఈ ఫొటోలో హీరోహీరోయిన్లు ప్రభాస్, శ్రద్ధాకపూర్ కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నారు.

వారిద్దరూ ప్రేమగా ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తూ ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. స్టైలిష్ లుక్‌లో ప్రభాస్ కనిపిస్తుండగా… హాట్ బ్యూటీ శ్రద్ధాకపూర్ చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిస్తోంది. ఈ ఫొటోకు సోషల్ మీడియాలో జోరుగా కామెంట్స్ వస్తున్నాయి. ఈ క్రేజీ మూవీలో అరుణ్ విజయ్, జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిషోర్, మందిరా బేడి, మురళీ శర్మ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

Prabhas and Shraddha Kapoor Saaho still leaked