Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

వరద బాధితులకు విరాళాల వెల్లువ

Prabhas donates 25 lakh to flood victims

భారీ వర్షాలతో  కేరళకు తీరని కష్టం వచ్చి పడింది. ఆ రాష్ట్రంలో వరదల మూలంగా ప్రాణ నష్టంతో పాటు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదలిస్తున్న ఈ విషాద సంఘటన నుంచి కోలుకోవడం కోసం కేరళవాసులకు అండగా నిలవడం కోసం సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ తమ వంతు సాయం చేస్తున్నారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే పలువురు స్టార్లు పెద్ద మొత్తంలో సాయం చేస్తుండడంతో విరాళాల ప్రవాహం కొనసాగుతోంది. కేరళవాసులను ఆదుకునేందుకు సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన వంతు సహాయంగా కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలను అందించారు. ఇక యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సైతం బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆయన వరద బాధితులకు సహాయంగా 25 లక్షల విరాళాన్ని అందజేశారు. ఇక నందమూరి హీరోలు కూడా విరాళాలు ప్రకటించి తమ సేవా ధృకృథాన్ని చాటుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేరళలోని వరద బాధితులకు సాయంగా రూ.25 లక్షలను ప్రకటించగా ఆయన అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్ పది లక్షల రూపాయలను ప్రకటించారు. అయితే అక్కినేని నాగార్జున ఆయన సతీమణి అమల కలిసి వరద బాధితుల కోసం  28 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అందరూ తమ వంతుగా వరద బాధితులకు సాయం చేసి వారికి అండగా నిలబడానికి వారు పిలుపునిచ్చారు. మలయాళ బ్యూటీ సాయి పల్లవి  తన వంతు సాయంగా 35 లక్షల రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.

Comments

comments