Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

దుబాయ్ నుంచి నగరానికి..

prabhas

బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘బాహుబలి’తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో ప్రభాస్ గత కొంత కాలంగా ‘సాహో’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ రెండు నెలల క్రితం దుబాయ్ వెళ్లింది. అబుదాబిలో దాదాపు రెండు నెలల పాటు నిరంతరం షూటింగ్ చేశారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలోని కీలకమైన యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించారు. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్ కెన్నీబేట్స్ ఆధ్వర్యంలో భారీ పోరాటాలను షూట్ చేశారు. ఈ యాక్షన్ సీన్లు సినిమాకే హైలైట్‌గా ఉంటాయి. సమయానికి ఈ సీన్లను పూర్తిచేయడంలో కెన్నీబేట్స్ కీలక పాత్ర పోషించాడు. ఇకపోతే మొత్తానికి ఈ షెడ్యూల్ ముగించుకొని ప్రభాస్ తాజాగా హైదరాబాద్‌కు తిరిగివచ్చాడు. ఎప్పుడూ లేనివిధంగా టాలీవుడ్‌లో ఒక సినిమా షూటింగ్ కోసం రెండు నెలలు ఫారిన్ షెడ్యూల్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. యువ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నెక్స్ సాహో షూటింగ్ మొత్తాన్ని హైదరాబాద్‌లో జరుపనున్నారు. ఇప్పటికే కొన్ని లొకేషన్స్‌ను ఖరారు చేశారు. మరికొన్ని సెట్స్ కూడా వేస్తున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ప్రభాస్ మరో సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

Comments

comments