Home సినిమా దేశంలోనే ఐదవ స్థానం

దేశంలోనే ఐదవ స్థానం

Prabhas made it top 5 in the Mood of Nation poll

దేశంలోని సూపర్‌స్టార్లలో ప్రభాస్ ఐదవ స్థానంలో నిలిచాడు. సౌత్‌లోని ఇతర స్టార్లను దాటేసి భారీ ఫాలోయింగ్‌తో అతను ఈ స్థానం దక్కించుకున్నాడు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్-2018ను ఇటీవల నిర్వహించింది. అందులో సెలబ్రిటీలు సాధించిన ఓట్లను బట్టి వారికి ర్యాంకులు కేటాయించారు. ఆ లిస్ట్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ల సరసన ప్రభాస్ నిలవడం విశేషం. ఈ పోల్‌లో డిఫరెంట్ కేటగిరీలున్నాయి. అందులో మేల్ సూపర్‌స్టార్ కేటగిరీలో ప్రభాస్ ఐదవ ర్యాంక్ సాధించడం విశేషం. మొదటి స్థానంలో సల్మాన్‌ఖాన్, రెండవ స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచారు. షారుఖ్‌ఖాన్, రణబీర్‌కపూర్‌లు మూడవ స్థానాన్ని పంచుకోగా బిగ్ బి అమితాబ్‌బచ్చన్ నాలుగవ స్థానం సాధించారు. ఇక ప్రభాస్, రణవీర్ సింగ్‌లు ఇద్దరూ సంయుక్తంగా  ఐదో ర్యాంక్‌లో నిలిచారు. ఇక్కడ ప్రభాస్ ఘనత ఏమిటంటే… టాప్-5లో చోటు దక్కించుకున్న ఒకే ఒక సౌత్ ఇండియన్ స్టార్ అతను కావడం విశేషం. ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్‌ను ఇది మరోసారి రుజువు చేసింది. మరోవైపు మోస్ట్ పాపులర్ ఫిమేల్ సూపర్‌స్టార్ విభాగంలో దీపిక పదుకునే, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మలు టాప్ ర్యాంక్ సాధించారు.