Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

యూరప్ నేపథ్యంలో పీరియాడికల్ మూవీ

Prabhas

‘సాహో’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు ప్రభాస్. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీలో తన కొత్త స్టైల్‌ను, కొత్త తరహా యాక్షన్ సీక్వెన్స్‌లను పరిచయం చేయబోతున్నాడు ఈ స్టార్ హీరో. అయితే ఇప్పటికే ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని కూడా అంగీకరించేశాడనే టాక్ ఉంది. నిజానికి ఈ స్టార్ హీరో ఓ బాలీవుడ్ మూవీ చేయాల్సి ఉంది. కానీ ముందుగా చేసుకున్న కమిట్‌మెంట్స్ ప్రకారం తెలుగు సినిమాలనే చేస్తూ అవి ఇతర భాషల్లో కూడా రూపొందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ‘సాహో’ చిత్రంలో బాలీవుడ్ నటులను కూడా తీసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ తదుపరి చిత్రంపై ఓ ఆసక్తికరమైన వార్త వినిపించింది. ఈ చిత్రం తెలుగులోనే ప్రధానంగా రూపొందనుండగా… పీరియాడికల్ మూవీగా ఇది తెరకెక్కనుంది. ఈ చిత్రం 1960-70ల కాలంలో యూరప్‌లో జరిగిన పరిస్థితులను తలపించేలా ఉంటుందని తెలిసింది. ఈ లవ్‌స్టోరీ మూవీని ప్రధానంగా యూరప్‌లోనే తెరకెక్కిస్తారట. ‘సాహో’ చిత్రం చివరి దశకు రాగానే ఈ చిత్రాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తిచేసేలా షెడ్యూల్ చేసుకుంటున్నాడు ప్రభాస్. అంటే రాబోయే 9 నెలల్లో రెండు సినిమాల షూటింగ్‌లను ఈ స్టార్ హీరో పూర్తిచేస్తాడన్నమాట. ఆతర్వాత ప్రభాస్ చేయబోయేది మాత్రం డైరెక్ట్‌గా బాలీవుడ్ మూవీనే.

Comments

comments