Search
Wednesday 18 July 2018
  • :
  • :

హైదరాబాద్ లో ‘సాహో’ షూటింగ్

sahoo

సినిమా: యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా ‘సాహో’ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిన్మా ఇటీవలే దుబాయ్ లో మేజర్ షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. హాలీవుడ్ రేంజ్ లో భారీ యాక్షన్ సీన్స్ ను దుబామ్ లో చిత్రీకరించారు. ఆ తర్వాత షెడ్యూల్ ను హైదరాబాద్ కి షిప్ట్ అయింది. బుధవారం నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సిన్మాకి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన షెడ్యూల్ అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.కీలక పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీన్లను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. హీరో హీరోయిన్లకు సంబంధించిన సన్నివేశాలు, కుంటుంబ కథ నేపథ్యంలోని  సన్నివేశాల చిత్రీకరణ ఈ షెడ్యూల్లో ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్, శ్రద్ధ కపూర్ గ్లామర్ ఈ సిన్మాకి మేయిన్ అట్రాక్షన్ గా నిలుస్తాయని ఫిలింనగర్ లో వినిపిస్తున్న టాక్.

Comments

comments