Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

అది ఎప్పుడో చెప్పలేకపోతున్నారు

Prabhas Sahoo Movie Shooting Update

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దుబాయ్‌లో కీలకమైన షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ కూడా ఇందులో పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి దర్శకుడు సుజిత్‌తో సహా నిర్మాతలు ఎవరూ చెప్పలేకపోతున్నారు. వేసవిలోనే సినిమా విడుదల అని తెలిసినప్పటికీ రిలీజ్ డేట్‌ను మాత్రం చెప్పడం లేదు. ఏప్రిల్ మొదటి వారంలో మహేష్‌బాబు ‘మహర్షి’ చిత్రంతో రాబోతున్నాడు. ఎంత లేదన్నా మూడు వారాలైనా దాని ప్రభావం ఉంటుంది. మరోవైపు చిరంజీవి ‘సైరా’ను మే 9న విడుదల చేసేందుకు ఫిల్మ్‌మేకర్స్ కష్టపడుతున్నారు. కాకపోతే ఆ రోజున ఖచ్చితంగా వస్తామని నిర్మాత రామ్‌చరణ్ సైతం చెప్పలేకపోతున్నాడు. ఇక ప్రభాస్ ‘సాహో’ సినిమా కేవలం టాలీవుడ్‌కు సంబంధించిన సినిమానే కాదు. మూడు భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ పార్టు యధాతథంగా ఉంటుంది కానీ టాకీ సీన్స్‌ను మాత్రం వేర్వేరుగా తీయాల్సి వస్తోంది. కాబట్టి ‘సాహో’ రిలీజ్ డేట్‌ను చెప్పడంలో ఇబ్బంది పడుతున్నారు ఫిల్మ్‌మేకర్స్. విడుదల ఎప్పుడా అనేది నిర్ణయించుకోకపోతే మరో చిక్కు ఉంది. హిందీ వర్షన్‌లో కూడా ఈ సినిమా తెరకెక్కుతోంది కాబట్టి అక్కడ  సినిమా విడుదలను ముందుగానే ప్లాన్ చేయాలి. ‘సాహో’లో గ్రాఫిక్స్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. దీంతో  పోస్ట్‌ప్రొడక్షన్  కోసమే నాలుగు, ఐదు నెలలు కేటాయించబోతున్నారట. ఇవన్నీ చూసుకొని  ‘సాహో’ రిలీజ్ డేట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారా అనేది చూడాలి.

Comments

comments