Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

రెండు నెలల తర్వాత ఇండియాకు..

Prabhas

బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘బాహుబలి’తో ప్రభాస్‌కు దేశ, విదేశాల్లో మంచి పాపులారిటీ వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమను గర్వపడేలా చేసినా ఈ చిత్రం భారీ కలెక్షన్లతో భారతదేశ సినీ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 200 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే అందులో కేవలం దుబాయ్ షెడ్యూల్ కోసమే 90 కోట్లు ఖర్చు చేశారు. రుమేనియా షెడ్యూల్‌లో కూడా ఇంతే భారీగా సినిమాను చిత్రీకరించాడు దర్శకుడు సుజిత్. విదేశాలలో చిత్రీకరణ పూర్తిచేసుకొని రెండు నెలల తర్వాత ‘సాహో’ టీమ్ ఇండియాకు  వస్తోంది. మొన్నటివరకు రోజుకు 25ం మంది సిబ్బందితో పాటు హై టెక్నికల్ టీమ్ ఈ సినిమా కోసం పనిచేసింది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీబేట్స్ అబ్బుపరిచే  యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశాడు దర్శకుడు సుజిత్. ఇక్కడ ముందుగా రెండు వారాల షెడ్యూల్ అనుకున్నా ఇప్పుడు ఏకంగా 47 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండేవిధంగా దర్శకుడు ప్లాన్ చేశాడు. ఇక దుబాయ్ షెడ్యూల్ కోసం భారీగా ఖర్చు పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు. అక్కడ షూటింగ్ చేస్తే దుబాయ్ టూరిజం రూల్స్ ప్రకారం 30 శాతం వెనక్కి ఇస్తారు. అంటే 90 కోట్లలో 25 కోట్లు రాయితీ అన్నమాట. మొత్తానికి ఇండియాలోనే బెస్ట్ యాక్షన్ సినిమాగా ‘సాహో’ను తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు సుజిత్.

Comments

comments