Search
Tuesday 20 November 2018
  • :
  • :

1970 దశకంలోని ప్రేమ కథ

Prabhas

ప్రస్తుతం పీరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. రామ్‌చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘రంగస్థలం’ నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తీసి ఘన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సుకుమార్. ఇక నాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో చేస్తున్న ‘జెర్సీ’ సినిమా కూడా 1980 బ్యాక్‌డ్రాప్‌లో చేస్తున్నదే. ఇంకా మరికొన్ని సినిమాలు కూడా ఇదే తరహాలో తెరకెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో కీలకమైనది ప్రభాస్ చేయబోయే ప్రేమ కథ సినిమా. ‘సాహో’ సినిమా తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ స్టార్ హీరో చేయబోయే సినిమా అదే. ఈ సినిమా కూడా పీరియాడిక్ సినిమా అని తెలిసింది. 1970 దశకంలో నడిచే కథ అని సమాచారం. సినిమా మొత్తం ఇటలీలో జరుగుతుందట. దాదాపు షూటింగ్ అంతా ఇటలీలోనే ఉంటుంది. 1970 నేపథ్యంలో జరిగే ఈ ప్రేమ కథా చిత్రం ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఈ సినిమాకు బడ్జెట్ వంద కోట్ల వరకు ఉంటుందని తెలిసింది.

Comments

comments