Home సినిమా ఆ స్టార్ సింగర్‌కు ప్రభాస్ ఫ్యాన్!

ఆ స్టార్ సింగర్‌కు ప్రభాస్ ఫ్యాన్!

Prabhas

ప్రభాస్ ఇప్పుడు బాహుబలిగా ప్రపంచం మొత్తానికి తెలుసు. కృష్ణంరాజు వారసుడిగా తెరంగ్రేటం చేసి సూపర్‌స్టార్‌గా ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు కోట్లాదిమంది అభిమానులు ప్రభాస్ సినిమా ‘బాహుబలి-2’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇంతటి స్టార్ హీరో కూడా ఓ ఆర్టిస్ట్‌కు వీరాభిమాని అంటే ఆశ్చర్యం వేయకమానదు. అతను ఎవరో కాదు. స్టార్ సింగర్ కైలాష్ ఖేర్. బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఎన్నో పాటలు ఆయన పాడాడు. అరుంధతి మూవీలోని ‘జేజమ్మా…’ పాటను పాడింది కైలాషే.

Kailash-Kher

అంతేకాదు బాహుబలి చిత్రానికి ముందు ప్రభాస్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘మిర్చి’లోని ‘పండగలా దిగి వచ్చాడు…’ పాటకు కూడా కైలాష్‌ఖేర్ గాత్రం అందించాడు. ఇప్పుడు బాహుబలి-2లో కూడా ఓ పాట పాడాడు ఈ సింగర్. ‘దండాలయ్యా..’ అంటూ తెలుగులో సాగే పాటకు హిందీ వర్షన్ ‘జయ జయకర..’ అంటూ సాగుతుంది. దీనికి కైలాష్‌ఖేర్ స్వరం ఇవ్వగా అది ఇప్పటికే ఛార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇక తన నాలుగేళ్ల కష్టం ‘బాహుబలి-2’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు ప్రభాస్. ‘బాహుబలి-2’ మూవీతో పాటు సుజిత్‌తో ప్రభాస్ చేయనున్న నెక్స్ సినిమా టీజర్‌ను కూడా జత చేయనుండడంతో ఈ స్టార్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అనాల్సిందే.