Search
Sunday 18 November 2018
  • :
  • :

ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రకటించిన మోడీ

PM-Modi

ఢిల్లీ: ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య అభియాన్ (ఆయుష్మాన్‌ భారత్‌) పథకాన్ని ప్రధాని నరేంద్ర  మోడీ ప్రకటించారు. 72వ స్వాతంత్య్ర వేడుకలలో భాగంగా ఎర్రకోటపైజాతీయ పతాకాన్ని పిఎం మోడీ ఆవిష్కరించారు. ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సెప్టెంబర్ 25న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. పేదల, మధ్యతరగతి ప్రజలందరికీ ఉచితంగా వైద్యసాయం చేస్తామని, తొలివిడతలో ఈ పథకం ద్వారా పది కోట్ల మందికి ఉచితంగా వైద్యసాయం వర్తింపచేస్తామని ప్రకటించారు.

రోగమొస్తే ఏంచేయాలన్న భయం పేదల్లో ఉండకూడదని, ఇంట్లో ఒకరికి రోగమొస్తే కుటుంబమంతా దిక్కుతోచని స్థితిలోకి వెళ్తోందన్నారు. ఈ పథకం అమలు కోసం అత్యాధునికి సాంకేతికతను వినియోగిస్తున్నామని, అవసరమైన వైద్య సిబ్బంది, సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య భారత్ లక్ష్యంగా ఈ పథకం పని చేస్తుందని చెప్పారు. అవినీతిపరులు, నల్లధనాన్ని అరకట్టగలిగామని, పౌరసరఫరాల్లో అవకతవకలను అరికట్టి రూ.90వేల కోట్లు ఆదాచేశామని, నిజాయతీగా పన్ను చెల్లించే వారి వల్లే దేశం ముందడుగు వేస్తోందని, ఒక్కరు పన్ను చెల్లిస్తే కనీసం మూడు కుటుంబాల ఆకలి తీరుతుందని, ఇంతకంటే మానవసేవ ఏముంటుందని అడిగారు.

ఢిల్లీ వీధుల్లో పవర్ బ్రోకర్ల ఆనవాళ్లు లేకుండా చేశామని, పైరవీకారుల ఎలా ఉంటారో ఢిల్లీలో కనబడకుండా చేశామని స్పష్టం చేశారు. అవినీతి అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకునేలా చర్యలు చేపడుతున్నామని, అవినీతికి పాల్పడాలంటేనే భయపడేలా చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టులో తొలిసారిగా ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారని, ఇది భారతీయ మహిళల శక్తికి నిదర్శనమని, స్వల్ప కాల సర్వీసు కమాండ్‌లో పని చేస్తున్న మహిళలకు పురుషులతో సమాన హోదా కల్పించామన్నారు. మహిళలపై నేరాలు చేసే రాక్షస శక్తులు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయని, వాటిని అణచివేస్తామని హెచ్చరించారు.

Comments

comments