రంగారెడ్డి : యావత్ తెలంగాణ ప్రజానికం ఆతృతంగా ఎదురుచూస్తున్న టిఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ఆదివారం రాత్రి కొంగరకలాన్‌లో ప్రారంభమైంది. తెలంగాణ సిఎం కెసిఆర్ సభా వేదికపైకి వచ్చారు. కెసిఆర్ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. నాలుగేళ్ల కెసిఆర్ పాలనలో సాధించిన అభివృద్ధి గురించి ఆయన వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం , ఎంపి కెకె మాట్లాడారు. కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలను వారు కొనియాడారు. ఇసుక వేస్తే రాలనంతంగా జనం తరలిరావడంతో కొంగరకలాన్ జాతరను తలపిస్తోంది. ఈ సభ సందర్భంగా అడుగుఅడుగునా నిఘా పెట్టారు.