Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

అన్ని దారులు కొంగరకలాన్ వైపే

TRS-Party

ఖమ్మం:  నాలుగున్నరేళ్ల ప్రభుత్వ ప్రగతిని వివరించడానికి టిఆర్‌ఎస్ నిర్వహిస్తున్న ‘ప్రగతి నివేదన’ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు ట్రాక్టర్లు, బస్సులు, ఇతర వాహనాలలో కొంగరకలాన్‌కు ఇప్పటికే చేరుకున్నారు.  కల్లూరులో ప్రగతి నివేదన సభకు వెళ్తున్న బస్సుల ర్యాలీని ఎస్ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డిసిసిబి చైర్మన్ మువ్వా ప్రారంభించారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎ పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో 300 బస్సులు, 300 ఇతర వాహనాల్లో జనం బయల్దేరారు. వైరా నియోజకవర్గం నుంచి 175 బస్సులు, 100 కార్లు, భద్రాద్రి కొత్తగూడెం, కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎ జగం వెంకట్ రావు ఆధ్వర్యంలో 250 బస్సులు, 250 ఇతర వాహనాలు, పినపాక నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎ పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 250 బస్సులు, 200 ఇతర వాహనాలు, ఇల్లందు నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎ కోరం కనకయ్య ఆధ్వర్యంలో 200 బస్సులు, 300 ఇతర వాహనాలు, పాల్వంచ నుంచి 70 బస్సులు, భద్రాచలం నుంచి 30 బస్సులు, 100 కార్లలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు బయలుదేరారు.

Comments

comments