Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

చారిత్రక ఇన్నింగ్స్

Praise rain on Kohli

కోహ్లిపై ప్రశంసల వర్షం

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సాధించిన శతకంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ అసాధారణ పోరాట పటిమతో చారిత్రక సెంచరీ సాధించిన కోహ్లికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, రాజకీయ వేత్తలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సహచరులు ఒక్కొక్కరూ ఇలా వచ్చి అలా వెనుదిరుగుతున్నా కోహ్లి మాత్రం చిరస్మరణీయ బ్యాటింగ్‌తో భారత్‌ను ఆదుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన శతకాల్లో ఒకటిగా విరాట్ సెంచరీ చిరకాలం గుర్తుండి పోతుందనడంలో సందేహం లేదు. పిచ్ బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం అనుకూలంగా లేకున్నా, తీవ్ర ఒత్తిడి ఎదురైనా కోహ్లి మాత్రం ఆధైర్య పడలేదు. తనకు మాత్రమే సాధ్యమయ్యే పోరాట పటిమతో శతకం సాధించాడు. టీమిండియా సాధించిన 274 స్కోరులో కోహ్లి చేసినవే 149 పరుగులు ఉండడం విశేషం. దీన్ని బట్టి కోహ్లి ఎంత అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడాడో ఊహించు కోవచ్చు. కిందటి సారి ఇంగ్లండ్ గడ్డపై అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచిన కోహ్లి ఈసారి మాత్రం చారిత్రక శతకం సాధించి తానెంటో నిరూపించాడు. ఈసారి తనను కట్టడి చేయడం అనుకున్నంత తేలిక కాదని చాటి చెప్పాడు. ప్రపంచ క్రికెట్‌లో పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న కోహ్లి ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీ అతని కెరీర్‌లోనే అరుదైన బ్యాటింగ్ ప్రదర్శనల్లో ఒకటిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. బంతి అనూహ్యంగా మలుపు తిరుగుతున్న పిచ్‌పై ఇటువంటి బ్యాటింగ్ చేయడం అందరికి సాధ్యం కాదు. అది కూడా జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో అయితే మరింత కష్టం. అయితే కోహ్లి మాత్రం తాను ఎంత ప్రమాదకర బ్యాట్స్‌మెనో ఇంగ్లండ్ బౌలర్లకు రుచి చూపించాడు. ఇటీవల కాలంలో కోహ్లి వరుస శతకాలు సాధిస్తున్న విషయం వాస్తవమే. అయితే ఇంగ్లండ్ గడ్డపై చెత్త రికార్డు ఉండడంతో కోహ్లి ఎలా రాణిస్తాడా అనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కోహ్లి చేసిన శతకం అతని కెరీర్‌లో అత్యంత అరుదైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలుస్తుందని చెప్పాలి. కాగా, కోహ్లి ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కొందరూ క్రికెటర్లు చేసిన ప్రశంసలు ఇలా వున్నాయి

Comments

comments