Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

MEDCHAL-1

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా :  సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడానికి ‘ప్రజా వాణి’ ఎంతో ఉపయోగ పడుతుందని కలెక్టర్ ఎం.వి.రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కాగా ప్రజావాణిలో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ 12 ఫిర్యాదులు అందాయని అధికా రులు తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న విఎఓలకు గౌరవ వేతనం చెల్లించాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో కలెక్టర్ ఎం.వి.రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

ప్రభుత్వ పథకాలను మహిళ సంఘాలకు వివరిస్తూ ప్రభుత్వానికి సంఘాలకు సంధాన కర్తగా పనిచేస్తున్న తమను 2009లో వైఎస్‌ఆర్ ప్రభుత్వం విబికెలుగా గుర్తించి రూ.2 వేల గౌరవ వేతనం అందిస్తామని ప్రకటన చేసినప్పటికి అమలుకు నోచుకో లేదని అన్నారు. ఆనాటి నుంచి గౌరవ వేతనం లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు. తద నంతరం రూ.5 వేల గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇంతవరకు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విఎఓలకు గౌరవ వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అకారణంగా తమ ఇంటి గోడను కూల్చిన వారిపై అధికా రులకు, పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఇంటి పత్రాలు కోరగా గ్రామ పంచాయతీ వారు తమను బెదిరింపులకు గురిచేస్తు న్నారని కీసర మండల నాగారం గ్రామానికి చెందిన బాధితురాలు ఖాజాబి కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేసింది. శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ గ్రామం లోని సర్వే నంబరు 129/1, 163/1లో ఉన్న 80.17 ఎకరాల ప్రభుత్వ భూమిలో దీర్ఘకాలంగా కాస్తు చేస్తున్న గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు  పట్టాలు మంజూరు చేయాలని పలువురు గ్రామస్తులు కలెక్టర్‌ను కోరారు. కుత్బుల్లాపూర్ మండలం దొమ్మరపోచంపల్లి గ్రామంలోని సర్వే నంబరు 168/1 నుంచి 168/10 వరకు గల భూమిలో నిర్మించుకున్న ఇళ్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతులు ఇవ్వాలని సర్పంచ్ రాములు గౌడ్ కలెక్టర్‌కు దృష్టికి తెచ్చారు.
సంక్షేమ పథకాల పకడ్బంధీగా అమలు
మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా : అధికారులు సమన్వయంతో పనిచేసి సంక్షేమ పథకాలను పకడ్బంధీగా అమలు చేయాలని కలెక్టర్ ఎం.వి.రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సంక్షేమ పథకాల అమలుతీరును, ప్రణాళికలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిచేందుకు అధికారులు ప్రతి రోజు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, దీనిపై ప్రజల సందేహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో నిరుద్యోగులకు జాబ్‌కార్డులు అందజేసి ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ముఖ్యంగా చెరువుల ఫీడర్ ఛానల్ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, భూగర్భ జలాలను కాపాడాలని సూచించారు. గ్రామ పంచాయతీలను సమన్వయం చేస్తూ గ్రామకంఠం భూములను గుర్తించి వాటిని గ్రామ అవసరాలకు ఉపయోగించాలని, ప్రతి గ్రామంలో స్మశాన వాటిక, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా రైతులు పొందే లబ్దిని వారికి వివరించి ప్రొత్సహించాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న కాలనీలలో పార్కులు, ఆట స్థలాలు ఉండేలా ప్రణాళికలు రూపొందిచాలని, ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వైన్‌ప్లూ వ్యాధి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.
మహాత్ముడికి ఘన నివాలి
మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్‌లు ఎం.రఘునందన్‌రావు, ఎం.వి.రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులతో కలిసి గాంధీ చిత్ర పటాలకు పూల మాలలువేసి మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు.