Home జాతీయ వార్తలు తాతకు ప్రేమతో…

తాతకు ప్రేమతో…

hd-devegowdaబెంగళూరు: దేశవ్యాప్తంగా జరిగిన సాదరణ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ దిగ్గజాలు ఓడిపోయారు. ఈ నేపథ్యంలో తుమకూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మాజీ ప్రధాని దేవేగౌడ ఓటమి పాలయ్యారు. కాగా, దేవేగౌడ కోసం తన సీటును త్యాగం చేస్తానని ఆయన మనువడు హసన్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. హసన్‌లో ప్రజ్వల్ రేవణ్ణ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. తాత కోసం తాను గెలిచిన ఎంపి పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. ఇది తొందరపాటు నిర్ణయం కాదన్న రేవణ్ణ… త్వరలోనే తాతను కలిసి 6న నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. కర్నాటకకు ఏం కావాలో దేవేగౌడకు బాగా తెలుసన్నారు.

రైతులు, బడుగు, బలహీన వర్గాల పక్షాన లోక్ సభలో తాత స్వరాన్ని వినిపించాల్సిన అవసరం ఉందని ప్రజ్వల్ రేవణ్ణ పేర్కొన్నారు. దేవేగౌడ ప్రతిసారి హసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు. కానీ తాజాగా జరిగిన సాదరణ ఎన్నికల్లో తన మనువడి కోసం హసన్ స్థానాన్ని దేవేగౌడ త్యాగం చేశారు. హసన్ నియోజకవర్గంలో రేవణ్ణ విజయం సాధించారు. ప్రజ్వల్ రేవణ్ణ రాష్ట్ర మంత్రి హెచ్‌డి రేవణ్ణ కుమారుడు అన్న సంగతి అందరికి తెలిసిందే. కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి మాండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఆ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన సుమలత అంబరీష్ గెలిచారు.

Prajwal Revanna Declares his Resignation For Hassan MP