Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

‘డియర్ సుప్రీం లీడర్…కాస్త డ్యూటీ కూడా చేయండి’

PRAKASH

న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో సినీనటుడు ప్రకాశ్ రాజ్ ఎక్కువగా రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అవకాశం వచ్చినప్పుడుల్లా ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి పార్టీపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకాశ్ రాజ్ విమర్శిస్తున్నారు. తాజాగా మోడీపై ప్రకాశ్ రాజ్ మరోసారి ట్విట్టర్ ద్వారా విమర్శించారు. మోడీని ‘సుప్రీం లీడర్ అంటూనే, కాస్త మీ పని కూడా మీరు చేయండంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘డియర్ సుప్రీం లీడర్… మీరు మీ ఫిట్‌నెస్ ఛాలెంజ్, యోగా, కసరత్తులతో బిజీగా ఉన్నారని మాకు తెలుసు. మీరు ఒక్క క్షణం పాటు ఊపిరి పీల్చుకుని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఓ సారి చూడిండి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో కలిసి పనిచేయమని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలివ్వండి. ఆయన మంచి పని కోసమే ధర్నా చేస్తున్నారు. ఆ తర్వాత మీరు కూడా మీ డ్యూటీ చేయండి’ అని ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Comments

comments