Home తాజా వార్తలు అటల్ జీని కరిచిన ప్రణబ్ ఇంట్లో శునకం

అటల్ జీని కరిచిన ప్రణబ్ ఇంట్లో శునకం

Pranab-vs-Vajpayee

ఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చనిపోయినప్పటి నుంచి ఆయనతో  ఉన్న మధురస్మృతులను రాజకీయ ప్రముఖులు, బిజెపి నేతలు గుర్తు చేస్తుకుంటున్నారు.  మాజీ రాష్ట్రపతి ప్రణబ్  ముఖర్జీ కూతురు షర్మిష్టా వాజ్ పేయితో ఓ మధురమైన జ్ఞాపకాన్ని గుర్తు చేశారు. గతంలో వాజ్ పేయి, ప్రణబ్ ముఖర్జీ ఇండ్లు పక్కపక్కనే ఉండేవి. ఒక రోజు వాజ్ పేయి వాకింగ్ కు వెళ్తుండగా ప్రణబ్ ఇంట్లో ఉండే శునకం అటల్ ని కరిచింది. ఈ విషయాన్ని షర్మిష్టా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ తన 93వ ఏట గురువారం సాయంత్రం గం. 5.05లకు న్యూఢిల్లీలోని ఆలిండియా మెడికల్ సర్వీసెస్ సంస్థ (ఎయిమ్స్)లో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అటల్ జీ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు హరిద్వార్ లో కలపనున్నారు. ఆయన అస్తికలను దేశంలోని అన్ని పవిత్ర  నదుల్లో కలపనున్నారు.