Search
Saturday 22 September 2018
  • :
  • :

చాలా నేర్చేసుకుందట

Pranitha

ఏ హీరోతో కలిసి నటిస్తే ఆ హీరోను ప్రశంసిస్తుంటారు కొందరు కథానాయికలు. అదేవిధంగా కన్నడ భామ ప్రణీత కూడా అదేచేసింది. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించిన సమయంలో పవన్‌కల్యాణ్‌ను ఆకాశానికి ఎత్తేసింది. పవన్ సూపర్బ్, ఆయన వ్యక్తితం అదుర్స్… అంటూ పొగిడింది. ఆతర్వాత ‘బ్రహ్మోత్సవం’లో మహేష్‌తో కలిసి నటించింది. తాజాగా ఈ సూపర్‌స్టార్‌తో కలిసి నటించడంపై మాట్లాడింది. దాదాపు ఆరేళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ప్రణీత ఇప్పటిదాకా నేర్చుకోలేని విషయాల్ని మహేష్‌తో కలిసి నటించడంతో చాలా నేర్చేసుకుందట.

ఇక మహేష్ సెట్‌లో తన పని తాను చేసుకుపోవడం తప్ప ఇతర విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోడు. ఏదైనా అవసరమైతే దర్శకులే చెబుతారు కదా అని తోటి నటీనటులకు కూడా ఎలాంటి సలహాలు ఇవ్వడు. ఇక పక్కన నటిస్తున్న వాళ్లతో మరీ చనువు పెరిగిందనుకున్నప్పుడు మాత్రం ఏదైనా ఒకటి రెండు మాటలు చెబుతాడంతే. కానీ ప్రణీత మాత్రం మహేష్ నుంచి అది నేర్చుకున్నా… ఇది నేర్చుకున్నా అని చెబుతుండడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. “కొందరిని చూస్తుంటూనే కొన్ని విషయాలు అర్థమవుతాయి. అలా మహేష్‌ను చూసినప్పుడు నాకు చాలా విషయాలు తెలిసొచ్చాయి’ అని ప్రణీత చెబుతోంది.

Comments

comments