Home ఆఫ్ బీట్ పతకాల వేటలో ప్రాన్సిసమ్మ

పతకాల వేటలో ప్రాన్సిసమ్మ

ఫ్రాన్సిసమ్మను అభినందిస్తున్న తోటి ఉద్యోగులు
అంతర్జాతీయ అథ్లెటిక్స్‌కు ఎంపికైన ఖమ్మం వాసి
జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో రాణింపు
రెండు గోల్ట్, ఒక స్విలర్ మెడల్ సాధించిన ఫ్రాన్సిసమ్మ

Pransisamma-with-Gold-Medal

ఖమ్మం అర్బన్ : జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో ఖమ్మం నగరానికి చెందిన సిహెచ్. ఫ్రాన్సిసమ్మ రాణించి మలేషియాలో జరిగే అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. రఘునాథపాలెం మండలంలోని మంచుకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న ఫ్రాన్సిసమ్మ మార్చి 24 నుంచి 27వ తారీఖు వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రెండు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్‌ను సాధించింది.

పది వేలు, ఐదు వేల మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుందన్నారు. 1500 మీటర్ల పరుగు పందెంలో రెండవ స్థానం సాధించి సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రం తరుపున మొత్తం 300 మంది పాల్గొని మార్చ్‌ఫాస్ట్‌లో బంగారు పతకాలు సాధించినట్లు ఆమె తెలిపారు. జాతీయ స్థాయిలో రాణించి ఖమ్మం జిల్లా కీర్తిని పెంచిన సిహెచ్ ఫ్రాన్సిసమ్మను మంచుకొండ పిహెచ్‌సీ డాక్టర్లు జీతేంద్రనాయక్, పావని, సిహెచ్‌ఓ సుజాత, ఇతర సిబ్బంది ఆమెను గురువారం అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఫ్రాన్సిసమ్మ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించామని 15 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో రాణించాలని కలలు కన్నానని ఆ కలలు ఈ రోజు తీరాయని ఆమె ఎంతో ఆనందంగా తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు.