Home అంతర్జాతీయ వార్తలు పారిస్ మృతులకు సైకత శిల్పి నివాళి

పారిస్ మృతులకు సైకత శిల్పి నివాళి

SAND-ARTభువనేశ్వర్ : పారిస్‌లో జరిగిన ఉగ్రదాడి మృతులకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పంతో నివాళులు అర్పించారు. ఉగ్రవాదాన్ని అరికడదాం… పారిస్ మృతుల కోసం ప్రార్ధన చేద్దాం… అంటూ భువనేశ్వర్‌లో సైకత శిల్పం ఏర్పాటు చేశారు. పారిస్ ఉగ్రదాడిలో 128 మంది చనిపోయిన విషయం విదితమే. ఈ దాడిని ఐఎస్ చేసిన విషయం కూడా తెలిసిందే.