Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ముల్తానీమట్టితో చర్మానికి రక్షణ

skin

వేసవిలో చర్మం కొంత కళావిహీనంగా తయారవుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే తాజాగా ఉంచుకోవచ్చు. అందుకు ముల్తానీ మట్టి ఉపయోగపడుతుంది. దీంట్లో అద్భుతమైన లక్షణాలున్నాయి. ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చర్మంలోని గరుకుదనాన్ని పోగొట్టి మృదుత్వాన్ని కల్గిస్తుంది. చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి కొత్త చర్మకణాలను ఉత్తేజపరుస్తుంది. ముల్తానీ మట్టి అన్ని చర్మాలకు ఉపయోగపడుతుంది. 
కాంతివంతమైన చర్మం కోసం: రెండు స్పూన్ల ముల్తానీ మట్టి, ఒక స్పూన్ పెరుగు, దోసకాయ గుజ్జు , రెండు చెంచాల శనగపిండిని తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిముషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. రెండు స్పూన్స్ ముల్తానీ మట్టి, టీ స్పూన్స్ గంధపు పొడి, చిటికెడు పసుపు తీసుకుని అన్నింటిని బాగా కలిపి, మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్ర పరచాలి. ఇది ఆయిలీ, పొడి చర్మాలకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ముల్తానీ మట్టి, తేనె, పసుపుతో చేసిన ప్యాక్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.
* పొడి, ఆయిలీ చర్మం కోసం: రెండు స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక స్పూన్ పెరుగు, 1/2 స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి ప్యాక్ వేసుకుని, పావుగంట తరవాత చల్లని నీటితో కడగాలి.
* చర్మంలో మార్పు కోసం: రెండు స్పూన్స్ ముల్తానీ మట్టి , 2 స్పూన్స్ బంగాళదుంప గుజ్జు తీసుకుని బాగా కలపాలి. మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేసి, 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.
* ఆయిలీ చర్మం కోసం: రెండు స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక స్పూన్ టమాటో గుజ్జు, 1/2 స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె తీసుకుని పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి , మెడకి పట్టించి, 20 నిమిషముల తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
* సన్ ట్యాన్ పోవాలంటే: రెండు స్పూన్స్ ముల్తానీ మట్టి, 1 స్పూన్ కొబ్బరి నీరు, స్పూన్ పంచదార తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి ప్యాక్ వేసుకుని, 15 నిమిషముల తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి.
* పొడి చర్మం కోసం: రెండు స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక స్పూన్స్ పాలపొడి, ఒక స్పూన్ ఓట్స్, ఒక స్పూన్ గుడ్డులోని తెల్ల సొన, ఒక స్పూన్ పెరుగు , ఒక స్పూన్ తేనె తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ముల్తానీ మట్టి, బాదం ఫేస్ ప్యాక్ చర్మాన్ని నునుపుగా చేస్తుంది. పాలల్లో ముల్తానీ మట్టి, బాదం కలిపి ప్యాక్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిముషాల తరువాత నీటితో కడగాలి.
* కొవ్వు చర్మాన్ని తగిస్తుంది: రెండు చెంచాల ముల్తానీ మట్టి, ఒక స్పూన్ గుడ్డులోని తెల్ల సొన కలిపి పేస్టులా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి , మెడకి ప్యాక్ వేసుకుని, 20 నిముషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
మొటిమలు వాటి మచ్చలకు: రెండు స్పూన్స్ ముల్తానీ మట్టి, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, అరగంట తరువాత నీటితో కడగాలి. మీరు ఊహించని అందమైన చర్మం సొంతం అవుతుంది.
నెల రోజుల్లో ముల్తానీ మట్టి , రోజ్ వాటర్, బంగాళదుంపతో చేసిన ఫేస్ ప్యాక్ చర్మాన్ని మచ్చ లేకుండా చేస్తుంది. మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.
ప్రకాశవంతమైన చర్మం కోసం: ముల్తానీ మట్టి, తేనె , రోజ్ వాటర్ తీసుకుని అన్నింటిని బాగా కలిపి, మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 30 నిమిషముల తరువాత నీటితో కడగాలి.
నల్లని మచ్చలు పోవాలంటే: ముల్తానీ మట్టి, వేప, రోజ్ వాటర్ వాడటం వల్ల నల్లని మచ్చలు పోతాయి. వీటితో ప్యాక్ తయారు చేసి మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిముషాల తరువాత నీటితో కడగాలి. మొటిమలతో బాధపడే వారికి ఇది ఒక మంచి చిట్కా.

Comments

comments