Search
Tuesday 20 November 2018
  • :
  • :

మైక్రోవేవ్ ఓవెన్ వాడకంలో జాగ్రత్తలు

ovenప్రస్తుతం వంటింట్లో మైక్రోవేవ్ ఓవెన్ల వాడకం పెరిగింది. వాటి వల్ల అవగాహన మాత్రం అంతంతా మాత్రంగానే ఉంటుంది. వీటిని ఉపయోగించే వారి కోసం కొన్ని చిట్కాలు.
* ఓవెన్‌లో ఎలాంటి పాత్రలను వాడకూడదన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. స్టీల్, ప్లాస్టిక్ పాత్రలు వాడకూడదు. మైక్రోవేవ్ పాత్రలు ప్రత్యేకంగా మార్కెట్‌లో లభిస్తాయి.
* ఓవెన్ లోపలి భాగంలో పదార్థాల తయారీ జరుగుతుంది గనుక అందులో జిడ్డు పేరుకుపోతుంది. అందుకే ఓవెన్‌ను తరచూ శుభ్రం చేసుకోవాలి.
ఓవెన్‌లోఆవిరి బయటకు పోయేందుకు మూతలను కొంచెం పక్కకు ఉంచాలి. లేదా రంధ్రాలున్న మూతలను వాడాలి. ఆహార పదార్థాలు ఉడికిన తరువాతే ఉప్పు కలపడం మంచిది.ఓవెన్ తలుపు పాడైనా, సరిగా పనిచేయకున్నా వాడకపోవడం ఉత్తమం. గుండ్రని ఆకారంలో ఉన్న పాత్రలు వాడితే ఆహార పదార్థాలు వేగంగా, సమంగా ఉడుకుతాయి.ఓవెన్‌లో టైమర్ సెట్ చేసి వండిన పదార్థాలు వెంటనే బయటికి తీయకుండా అలానే కొంత సేపు ఉంచి, తరువాత బయటికి తీసి తింటే రుచిగా ఉంటాయి.

Comments

comments