Home సూర్యాపేట ఆదమరిస్తే అంతే సంగతి

ఆదమరిస్తే అంతే సంగతి

Precautions to be used in cylinder use

మన తెలంగాణ/అర్వపల్లి : నిత్యజీవితంలో భాగమైన వంటగ్యాస్ వాడకం పట్ల నిర్లక్షం చేస్తే పెద్ద ప్రమాదమే. ఇంట్లో ఉండే సిలి ండర్ పట్ల ఎల్లప్పడు జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ అవసరం లేకుంటే కట్టేయడం, సిలిండర్ పరిసరాల్లో స్టౌవ్‌ను పరిశీలిస్తు ఉండాలి. లేకు ంటే నిండు ప్రాణాలు గాలిలో కలసిపోయే ప్రమాదముంది. జి ల్లాలో లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం పథకం కిం ద 60శాతం, 30శాతం సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియో గిస్తున్నారు. వీరంతా నిత్యం వంట కోసం గ్యాస్ వాడకం చేస్తు న్నారు. నిత్యం ఇంట్లో భాగమైన గ్యాస్ ప్రమాదాలకు నిలయమే. ఇలాంటి గ్యాస్ వాడకం పట్ల వినియోగదారులు మెలకువలు పాటిస్తే మంచిది.
బీమాతో నష్ట నివారణ: ప్రమాదం జరిగిన వెంటనే విపత్తు నివా రణ కార్యాలయానికి సమాచారమివ్వాలి. ఆ తర్వాత ఎవరికైనా ప్రమాదం సంభవిస్తే 108సాయం తీసుకోవాలి. అత్యవసరమైన చి కిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించాలి. మంటలు అదుపు చేసేం దు కు అగ్నిమాపక సిబ్బంది సాయం పొందాలి. గ్యాస్ వాడకం చేసే వ్యక్తులు వారి కుటుంబసభ్యుల పేరు మీద బీమా చేయించు కోవాలి. తక్కువ ఖర్చుతో గ్యాస్ సరఫరా చేసే ఏజేన్సీ నిర్వాహకులే బీమా సౌకర్యం కల్పిస్తారు.వ్యక్తితో పాటు ఇల్లు ఇతర వస్తువులకు బీమా వర్తిస్తుంది. ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల నష్ట నివారణ తగ్గించుకోవచ్చు. సిలిండర్ కాలపరిమితిని గుర్తించాలి. సిలిండర్ నిటారుగా స్టౌవ్‌కు తక్కువ ఎత్తులో ఉండేలా చూడాలి. స్టౌవ్‌కంటే ఎ క్కువ ఎత్తులో సిలిండర్‌ను ఉంచకూడదు. సిలిండర్‌ను ఒక స్టౌవ్ కంటే ఎక్కువ వాటికి ఉపయోగించకూడదు. గ్యాస్ సిలిండర్ తీసు కు వచ్చిన వ్యక్తితోనే స్టౌవ్‌కు రెగ్యులేటర్ తప్పనిసరిగా ఉంచాలి.
సిలిండర్ వాడకంలో పాటించాల్సిన జాగ్రత్తలు
సిలిండర్ నిలువుగా పెట్టి ఉంచాలి. సూర్యరశ్మికి, వర్షానికి, వేడికి తగిలేటట్లు ఉంచితే ప్రమాదమే. మూసి ఉంచిన బీరువా వద్దకానీ, అల్మారాలో కానీ సిలిండర్ ఉంచకూడదు. గ్యాస్ సిలిండర్ రబ్బర్, ట్యూబ్, రేగ్యులేటర్ మార్చడానికి స్థలం ఖాళీగా ఉంచాలి. సిలిండర్ దగ్గర్లో కిరోసిన్,గుడ్డసంచులు, కాగితాలు, మొదలైన వస్తువులు ఉంచరాదు. స్టేఫ్టీ క్యాప్ సిలిం డర్‌కు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. రెగ్యు లే టర్ నుంచి తగు ప్రెషర్ వస్తుందో లేదో తెలు సుకోవాలి. సరైన కండీషన్‌లో ఉందా లేదా చెక్ చేయించుకోవాలి.ఐఎస్‌ఐ అనుమతి ఉన్న పరికరాలే వాడాలి. గ్యాస్‌స్టౌవ్ మొదలుకుని రె గ్యులేటర్,ట్యూబ్ లైటర్ అన్ని నాణ్యమైనవే వా డాలి. రబ్బర్ ట్యూబ్ పాడవకుండా చూసుకో వాలి. పగుళ్లు రాకుండా చూసుకో వాలి. ట్యూబ్ మీటరు నుంచి మీటరున్నర పొడవు ఉండేలా చూసుకో వాలి. తయారు నుంచి 30నెలలు మించి వాడకూడదు. వలయా కారంలో అమర్చుకోవాలి. గ్యాస్ పొయ్యి సిలిండర్ కంటే ఎత్తులో ఉండాలి. తరచూ పొయ్యిని శుభ్రం చేసుకోవాలి. సర్వీసింగ్ చేసిన తర్వాత బర్నర్, సిమ్మర్ క్రమంలో ఉన్నాయో లేదో చూసు కోవాలి.వంట గదిలో తగినంత వెలు తురు ఉండేలా చూసుకోవాలి. వంట గది, పూ జ గదికి సంబంధిచిన దీపం తదితరాలు ఉంచ రాదు. రిఫ్రిజిరేటర్ తదితర వస్తువులు ఉంచితే ప్రమాదమే. ఫ్రెష్ రెగ్యులేటర్ బిగించడం అవగాహన ఉండాలి. రాత్రి పడు కునే ముందు రెగ్యులేటర్ స్విచ్ ఆపుచేయాలి.
ఉండాల్సింది ఇలా…
వాణిజ్య సిలిండర్‌లో ఉండాల్సిన గ్యాస్ 19కిలోలు. గృహా వసరాల ఎల్‌పీజీ సిలిండర్‌లో ఉండాల్సిన గ్యాస్14.20 కిలోలు. గ్యాస్ డెలి వరీ బాయ్ విధిగా వెయిట్ మిషన్ తేవాల్సి ఉంటుంది.