Home లైఫ్ స్టైల్ అమిత ప్రేమా… అంతొద్దు!

అమిత ప్రేమా… అంతొద్దు!

భార్యాభర్తలు, ప్రేమికులు ..వీరిమధ్య ప్రేమ ఉండటం అత్యంత సహజం. అంతవరకూ చాలా బాగుంటుంది. కానీ ఆ ప్రేమ హద్దుమీరితేనే అసలు సమస్య మొదలయ్యేది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు ప్రేమ విషయంలోనూ అతి పనికిరాదు. ఎప్పుడైతే విపరీతమైన ప్రేమ ఉంటుందో మనకు తెలియకుండానే హద్దులు పెట్టడం మొదలవుతాయి. అవతలి వారికి అది అతి పెద్ద సమస్యగా మారుతుంది. చివరికది విడిపోవడానికి కూడా దారితీస్తుందనడంలో సంశయంలేదు. ఇలాంటి జంటలను సమాజంలో చాలామందిని చూస్తున్నాం. ఒకర్నొకరు ప్రేమతోపాటు గౌరవం, మర్యాద, స్వేచ్ఛలను ఇస్తుండటం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తవు. పార్ట్నర్ కు ఇబ్బంది కలిగించనంత వరకూ ఆ ప్రేమ పదిలంగా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితి ఇంట్లో ఉండాలంటే ఏమేం చేయాలో తెలుసుకుందాం…

Love

 

భార్యాభర్తలు ఒకరినొకరు ఇంటి సమస్యల్ని పంచుకోవాలి. ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరికోసం ఒకరుగా బతకాలి. అలాగే అహం అంటే ఇగోల జోలికెళ్లకుండా ఇంటి పనులనూ పంచుకుంటే ఇక ఆ ఇల్లు స్వర్గమే. ఒకరికి తమ ప్రేమకు ఎలాంటి గౌరవం లేదని, ఇంకొకరికి తన భాగస్వామి తన స్వేచ్ఛను హరించి వేస్తూన్నాడనే భావన కలిగించకుండా మెలగాలి. లేకుంటే ఇద్దరి మధ్య దూరం ఏర్పడటం మొదలవుతుంది. పరిస్థితి ఇద్దరూ విడిపోయే దాకా వెళుతుంది. ఈ పరిణామం మీకు ఏర్పడకుండా ఉండాలంటే ఈ సూచనలను దృష్టిలో పెట్టుకోవడం తప్పనిసరి.

నిఘా పెట్టకండి

తరుచుగా మనం చూస్తుంటాం, మనం ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే వారిని అనుక్షణం గమినిస్తూ ఉండాలని పట్టించుకుంటూ ఉండాలని ఆలోచిస్తుంటాం. కానీ ఇది ఎప్పుడు హద్దు దాటుతుందంటే మీరు మీ పరిమితిని మించి మీ భాగస్వామిపై కన్నేసి ఉంచినప్పుడు జరుగుతుంది. మితి మీరిన ప్రేమ కారణంగా పార్టనర్‌లో విసుగు, కోపం పుట్టుకు వస్తాయి. ఎందుకంటే మీరు ప్రతి నిమిషం వారు ఏం చేస్తున్నారో అన్నింటిపైనా దృష్టి పెడతారు. ఇది వారికి తమ స్వేచ్ఛను మీరు హరిస్తున్నట్లుగా అనిపించడం మొదలవుతుంది. వారు తమకు తాము ఒక బందిఖానాలో ఉన్నట్లుగా తెగ బాధపడుతుంటారు.

స్పేస్ ఇవ్వడం మంచిది

సంబంధం ఎలాంటిదైనా కానీయండి. అందులో స్పేస్ ఇవ్వడం తప్పనిసరి. లేకపోతే ఆ సంబంధం ఎక్కువకాలం నిలవడం చాలా కష్టమవుతుంది. స్పేస్ ఇవ్వకపోతే ప్రేమ తగ్గిపోతుంది. గొడవ పెరుగుతుంది. దీంతో బంధంలో దగ్గరితనం బదులు దూరాలు ఏర్పడతాయి.

 

హక్కు అని చెప్పొద్దు

ప్రేమలో స్పేస్ మాయమైనప్పుడు పార్టనర్ తన వ్యక్త్తిత్వాన్ని కోల్పోతారు. దాంతోపాటు వారి మానసిక సమతుల్యత కూడా దెబ్బ తింటుంది. వారికి మానసిక సమతుల్యత కూడా దెబ్బ తింటుంది. వారికి మాటిమాటికీ కోపం వస్తుంది. దీని కారణంగా వారి చిన్నచిన్న విషయాలపై వాదించడం సాధారణ విషయంగా మారిపోతుంది. పార్టనర్‌పై నిరంతరం హక్కు ప్రదర్శిస్తే వారికి అది కోపం తెప్పిస్తుంది.

ఎప్పుడూ పార్టనర్‌తో ఉండటం

మితిమీరి ప్రేమించే వారు తమ పార్టనర్ ఎప్పుడూ తనతోనే ఉండేలా ప్రయత్నిస్తుంటారు. కానీ పార్టనర్ ఎప్పుడైనా తన స్నేహితులతో లేదా బంధువులతో కలసి వెళ్లాలనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీరు ప్రదర్శించే మితి మీరిన ప్రేమ వారికి ఒక శిక్షలాగా మారుతుంది.

ఆశకు హద్దు ఉండాలి

చాలాసార్లు మనం మన పార్టనర్‌పై మితి మీరిన ఆశ పెట్టుకుని పార్టనర్ మనల్ని ప్రేమిస్తూ ఉంటే గనక మన నమ్మకాన్ని వమ్ము చేయరని అనుకుంటాం. మీరు వారిని ఎంత ప్రేమిస్తారో అంత వారు మిమ్మల్ని ప్రేమించాలనుకుంటే ఇది వారికి పంజరంలో ఉంచినట్లు అనిపిస్తుంది. దీంతో వారు తమంతట తాముగా ఇందులో నుండి బయటపడే ప్రయత్నంలో పడిపోవడం ఖాయం.

అనుమానించకండి

మీ పార్టనర్ ప్రతి చిన్న విషయాన్ని మిమ్మల్ని అడిగి చేయాలని లేదు. కానీ మీరు వారు ఏదైనా సరే మీతో చెప్పి చేయాలని భావిస్తుంటారు. ప్రతీసారి మీరు వారికి ఫోన్ చేస్తూ ఉండటం మీ పార్టనర్ ఏం చేస్తున్నారు, వారిని అనుమానిస్తూ ఉండటం, వారు మాట్లాడే ప్రతి దాన్నీ మైండ్‌లో పెట్టుకోవడం ఇవన్నీ మీ పార్టనర్‌కి విసుగు తెప్పిస్తుంటాయి.

సాన్నిహిత్యంలో హద్దుల్లో ఉండాలి

Valentine's Day

హద్దు దాటిన సాన్నిహిత్యం ఒకరినొకరు పోట్లాడుకునే అవకాశాన్ని పెంచుతుంది. ఎందుకంటే హక్కును ప్రదర్శించడం అప్పుడప్పుడు ఆదేశాలివ్వడంతో మార్పుకు లోనవుతుంది. అందుకే మీ పార్టనర్‌కు ప్రేమను పంచండి. కానీ మితిమీరికూడదు. మీ మీ సంబంధం ఎంత గౌరవనీయమైనదో వారిని స్వయంగా అర్థం చేసుకోనివ్వండి. మీరు ప్రకటించే ప్రేమ

మీ ఇద్దరికీ తలనొప్పిగా మారకూడదు.

* మీరు మీ పార్టనర్‌ను అతిగా ప్రేమిస్తుంటే మీరు మీ ప్రేమ వారిపై రుద్దకూడదు. బలవంతం చేసే ప్రయత్నం చేయకూడదు.
* నేను ఎంత ప్రేమను కురిపిస్తే, ఎంతగా పట్టించుకుంటే అంతగా నా పార్టనర్ కూడా ప్రదర్శించాలని మీరు అనుకోవచ్చు. కానీ వారు మీలాగే ఆలోచిస్తూ ఉంటారని వారు అనుకోవడానికి వీలు లేదు.
* ఎప్పుడూ మీ పార్టనర్ కొంగు పట్టుకుని తిరగండి. తోకలా ఉండకండి. మీ ప్రేమను హద్దుల్లో ఉంచుకోకండి.
* మీ పార్టనర్ మీపై ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తున్నారని అనిపించినప్పుడు వారితో దూరంగా ఉన్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. వారికి కొంచెం సమయం ఇవ్వండి. ఎటువైపు నుంచి ఒత్తిడి వచ్చినా ఇద్దరి మధ్య బంధం ఎక్కువ కాలం నిలవలేదు.
* ఒకవేళ మీ పార్టనర్‌ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నా, అంతగా వారు ప్రేమించకపోతే లేదా మీ మనసుకు తగినట్టుగా రెస్పాన్స్ లేకపోతే అప్పుడు ధైర్యంగా ఉండండి. పార్టనర్‌తో మాట్లాడండి.
* బంధాల్లో రోజురోజుకీ మార్పు వస్తుంటుంది. సమయంతోపాటు అంతా మారుతుంటుంది. ఇలాంటి స్థితిలో మీ బంధంలో వస్తున్న మార్పుల గురించి మాట్లాడుతూ ఉండటం తప్పనిసరి.
* ఎప్పుడూ ఎత్తిపొడుస్తూ ఉంటే ఆ బంధం ఎక్కువ రోజులు నిలవదు. పార్ట్‌నర్‌పై నిరంతరం మీరు దృష్టి పెడితే అది ప్రేమ కాకుండా మీ పార్టనర్‌లో అపనమ్మకం ఏర్పరుస్తుంది.
* పార్టనర్ బంధువుల్ని అతిగా విమర్శించకండి.
* వారినీ మీవారిలాగే ఆదరించండి. దాని ప్రభావం అవతలివారిపై పడుతుంది.

Telangana news

 

Prefer Love is not Good between Couple

 

Prefer Love is not Good between Couple