Search
Saturday 17 November 2018
  • :
  • :

వైద్యం వికటించి నిండు గర్భిణీ మృతి..

 Pregnant woman died
నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని కామినేని ఆసుపత్రిలో వైద్యం వికటించి గర్భిణీ స్త్రీ మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరం మండలం ఊట్కూర్ గ్రామానికి చెందిన వర్రె లక్ష్మిపార్వతి(24)సోమవారం డెలివరీ నిమిత్తం కామినేని ఆసుపత్రిలో చేరింది. సోమవారం రాత్రి లక్ష్మిపార్వతికి ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు మగబిడ్డ జన్మించాడని తెలిపారు. బిడ్డ పుట్టాడని సంతోషం వ్యక్తం చేశారు కానీ,ఆ సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. లక్ష్మిపార్వతిని ఆపరేషన్ థియేటర్‌ నుంచి ఎంత సేపటికి తీసుకురాకుండా డాక్టరు చేసే హడావుడిని గమనించిన బంధువులు డాక్టర్ ను నిలదీయడంతో మగళంవారం ఉదయం లక్ష్మిపార్వతి చనిపోయిందని వారు చెప్పారు. దీంతో బిత్తరబోయిన బంధువులు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. లక్మిపార్వతికి కన్న కొడుకును చూసుకునే భాగ్యం లేకుండా పోయిందని కన్నీటి పర్యంతం అయ్యారు. మృతికి కారణమైన డాక్టర్లను వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ గేటు లోపలికి వెల్లబోయిన బంధువులను సెక్యురిటి సిబ్బంది అడ్డుకున్నారు. మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించి మృతురాలి భర్త వర్రె సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments