Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

గర్భిణీని భుజాలపై మోసుకెళ్లిన భర్త…

 pregnant woman is suffering from pain

విజయనగరం: గర్భిణీకి పురిటి నొప్పులతో బాధపడుతుంటే భర్త తన భుజాలపై ఆమెను 12 కిలోమీటర్ల మోసుకెళ్లిన విషాద సంఘటన విజయనగరం జిల్లాలోని కొండతామర గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. జిందమ్మ అనే మహిళ ఎనిమిది నెలల గర్భిణీ. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని భర్త అనుకున్నాడు. అయితే గ్రామానికి రోడ్డు సదుపాయం లేదు. దీంతో గ్రామస్థుల సహాయంతో వెదురు కట్టెకు ఒక దుస్తువు కట్టి, దాంట్లో గర్భిణీని కూర్చొబెట్టి తమ భుజాలపై మోసుకెళ్లారు. ఆ భర్త ముందు, వెనుకాల మరొకరు వెదురు కట్టెను తమ భుజాలపైకి ఎత్తుకొని గర్భిణీని 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుగ్గేరుకు బయలు దేరారు. అయితే మార్గ మధ్యలో జిందమ్మకు పురిటి నొప్పులు అధికమవడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డ పుట్టగానే కొన్ని నిమిషాల వ్యవధిలో  చనిపోయాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావం అవడంతో దుగ్గేరుకు తీసుకువచ్చి అక్కడ్నుంచి పార్వతీపురానికి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. ప్రస్తుతం పార్వతీపురం ఐటిడిఏ ఆసుపత్రిలో జిందమ్మ చికిత్స పొందుతుంది.

Comments

comments