Home జాతీయ వార్తలు మంచులో చిక్కుకున్న గర్భిణికి సైన్యం సాయం

మంచులో చిక్కుకున్న గర్భిణికి సైన్యం సాయం

Army helps Pregnant Womanశ్రీనగర్: దట్టమైన మంచులో చిక్కుకుని, ఆస్పత్రికి వెళ్లలేని ఓ గర్భిణి ఓ అద్భుతం జరిగి కవల పిల్లల్ని ప్రసవించింది. కాన్పు వచ్చే సమయంలో ఆమె ఆస్పత్రికి వెళ్లలేక ఇబ్బంది పడుతోంది. ఆప్పుడు ఆమెను సైనికులు ఆదుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉత్తర కశ్మీర్‌లోని బండిపోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తన భార్య గుల్షానా బేగంను ఆస్పత్రి తీసుకెళ్లేందుకు సాయం చేయవలసిందిగా కోరుతూ శుక్రవారం బండిపోర్‌లోని పనార్ సైనిక శిబిరం కంపెనీ కమాండర్‌కు ఒక గ్రామీణుడి నుంచి ఫోన్ వచ్చిందని అధికారులు తెలిపారు.

ఆ సమయంలో వాతావరణ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మంచు బాగా పడుతోంది. ఉష్ణోగ్రత మైనస్ ఏడుకు పడిపోయింది. రోడ్ల మీద మంచు పేరుకుపోయింది. వాహనాన్ని నడపడం చాలా కష్టం. కానీ ఆమెను ఎలాగైనా ఆస్పత్రికి చేర్చాలి. ఆ పరిస్థితిలో బండిపోర్ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కొందరు రోడ్డుపై మంచుకు తొలగించి ఆమె ఇంటికెళ్లారు. స్ట్రెచర్‌పై ఆమెను ఉంచి, రెండున్నర కిలోమీటర్లు నడుస్తూ తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆర్మీ అంబులెన్స్‌లో ఆమెను బండిసోర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ముందే ఆస్పత్రి వైద్యులకు చెప్పిఉంచడంవల్ల వెంటనే ఆమె ప్రసవానికి ఏర్పాట్లు చేశారు. సమయానికి సైనికులు చేసిన సాయం మరచిపోలేనిదని ఆధికారులు చెప్పారు.

Pregnant woman stuck in snowfall delivers twins after Army helps her