Home హైదరాబాద్ వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి

DEATH-IMAGE

కోణార్క్ వైద్యుల నిర్వాకం

బంధువుల ఆందోళన

మన తెలంగాణ/పేట్‌బషీరాబాద్ : పైసమే పరమాత్మ అనే సామెతకు సరితూగుతూ ప్రైవేటు ఆసుపత్రులు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మారేందుకు ధనిక, పేద అనే తారతమ్యాలు లేకుండా డబ్బులు గుంజుతున్నారు. వివరాల్లోకి వెళితే కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఎన్‌సీఎల్ గోదావరి హోమ్స్ సమీపంలో పైపులైన్ రోడ్డులో గల కోణార్క్ ఆసుపత్రిలో నిండు గర్భిణి ప్రసూతికి వస్తే వైద్యుల నిర్లక్షంతో ప్రాణం పోయింది. ఐడిపిఎల్ సమీపంలోని గిరినగర్‌కు చెందిన అశ్రఫ్ సుల్తానా ప్రసవం కోసం గత నెల 27న ఆసుపత్రిలో చేరింది. మరుసటి రోజు బాబుకు జన్మనిచ్చింది. అయితే అప్పటి నుంచి ఆసుపత్రి యాజమాన్యం బాధితురాలు అశ్రఫ్ సుల్తానాకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి సుమారు 10 రోజల వ్యవధిలో సుమారు 2 లక్షల వరకు  పలు రకాలుగా డబ్బులను ముట్టజెప్పారు.

అయితే గత రాత్రి వరకు అశ్రఫ్ సుల్తానా ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని తెలిపిన వైద్యులు శుక్రవారం ఉదయం పల్స్ రేట్ తగ్గడంతో పాటు శరీరంలో కొన్ని అవయవాలు వైద్యానికి సహకరించడం లేదని చేతులు ఎత్తేశారు. దీంతో అశ్రఫ్ సుల్తానా బంధువులు ఆసుపత్రి ఆవరణంలోనే రోదనలు మిన్నంటాయి. ముందే పసిగట్టిన ఆసుపత్రి యజమాన్యం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అం దించడంతో సీఐ రవిచంద్ర, ఎస్‌ఐ శ్రీనాథ్, గౌతమ్, డిఐ దుర్గాప్రసాద్ బలగంతో ఆసుపత్రి వద్ద బ ందోబస్తు ఏర్పాటు చేశారు. విషయాన్ని గమనించిన అశ్రఫ్ సుల్తానా బంధువులు మీడియాను ఆశ్రయించారు. దీంతో మీడియా అక్కడికి చేరడంతో ఆందోళన మరింత ఉద్రిక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలానగర్ జోన్ ఎసీపీ టి.గోవర్ధన్‌తో పాటు జీడిమెట్ల, దుండిగల్, ఆల్వాల్, ఇన్‌స్పెక్టర్లతో పాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున్న ఆందోళనకు గురయ్యారు. వారిని సముదాయించిన ఎసీపీ గోవర్ధన్ మెరుగైన వైద్యం కావాలని వారికి మనోధైర్యాన్ని ఇవ్వడంతో కాస్త వెనుక తగ్గిన ఆందోళన కారులు నగరంలోని యశోద ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. వైద్యం చేస్తున్న క్రమంలో 3 గంటల సమయంలో అశ్రఫ్ సుల్తానా మృతి చెందింది.  మృతురాలి భర్త ఎండి.హషం పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఆసుపత్రి యజమాన్యంపై  ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.