Home జిల్లాలు నేడు ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలు

నేడు ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలు

exams2జిల్లాకేంద్రంలో 33 పరీక్ష కేంద్రాలు
అవకతవకలు జరుగకుండా పకడ్భందీ చర్యలు
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారిగా ఆదివారం నల్లగొండలో నిర్వహించనున్న ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు పరీక్షకేంద్రాలకు గంట ముందుగానే చేరుకో వాలని జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ నాగేందర్‌రెడ్డి తెలిపారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలో 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిజికల్ ఈవెంట్స్‌కు ముందుగా నిర్వహించే రాతపరీక్షను జిల్లా అధికారులు సవాల్‌గా తీసుకొని సక్సెస్ చేసేందుకు సమాయత్తమ య్యారు. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికి స్వయంగా వీడియో కాన్ఫరెన్సులు ద్వారా ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఏర్పాట్ల నిఘాపై చర్చించారు. పరీక్షకేంద్రాల ఎంపిక, ఇన్విజిలెటర్లు, సెంటర్ల ఏర్పాట్లను పర్యవేక్షిం చారు. పరీక్ష సెంటర్లలో సీసీకెమెరాలను ఏర్పాటు చేయడం తో పాటు ఆయా ప్రాంతాలలో ఉన్న జీరాక్స్ సెంటర్లు మూసివేయించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ను విధించారు. వాస్తవానికి ఈ పరీక్షలు మార్చిలో నిర్వహించాల్సి ఉండగా అనివార్యకారణాలతో 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు పోలీసువర్గాలు పేర్కొం టున్నారు. నాగార్జున ప్రభుత్వ కళాశాల సెంటర్ -ఏ హైద్రాబాద్ రోడ్డు, నాగార్జున ప్రభుత్వ కళాశాల సెంటర్ -బి హైద్రాబాద్ రోడ్డు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సెంటర్ -ఏ న్యూ బిల్డింగ్ రామగిరి, ఆల్ఫా బాలుర జూని యర్ కళాశాల సెంటర్ -ఏ రామగిరి, ఆల్ఫా బాలికల జూనియర్ కళాశాల సెంటర్ -బి రామగిరి, ప్రతితి జూని యర్ కళాశాల హైద్రాబాద్ రోడ్డు, గీతాంజలి జూనియర్ కళాశాల హైద్రాబాద్ రోడ్డు, గౌతమి బాలు జూనియర్ కళాశాల రాఘవేంద్రనగర్, నల్గొండ ఇనిస్టీట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ చర్లపల్లి, నీలగిరి డిగ్రీ కళాశాల రామగిరి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ హైదరాబాద్ రోడ్డు, సిద్దార్ధ డిగ్రీ కళాశాల డాక్టర్స్ కాలనీ, శ్రీచైతన్య డిగ్రీ కళాశాల అన్సారీ కాలనీ, సెయింట్ ఆల్పాన్స్ స్కూల్ దేవరకొండ రోడ్డు, నల్గొండ డిగ్రీ కళాశాల ఆర్‌పి రోడ్డు, లిటిల్ ప్లవర్ గల్స్‌హైస్కూల్ సంజీవయ్య నగర్, డాన్‌బోస్కో డిగ్రీ కాలేజీ ఎస్‌ఎల్‌బిసి సాగర్ రోడ్డు, డాన్‌బోస్కో జూనియర్ కాలేజీ ఎస్‌ఎల్‌బిసి సాగర్ రోడ్డు, డాన్‌బోస్కో హైస్కూల్ ఎస్‌ఎల్‌బిసి సాగర్ రోడ్డు, నార్కట్‌పల్లి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చర్లపల్లి, డివిఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చర్లపల్లి, ప్రభుత్వ మహిళౠ జూనియర్ కాలేజీ సెంటర్ – ఏ ఆర్‌పి రోడ్డు,ప్రభుత్వ మహిళౠ జూనియర్ కాలేజీ సెంటర్ – బి ఆర్‌పి రోడ్డు, శ్రీరాఘవేంద్ర డిగ్రీ కాలేజీ ఆర్‌టిసి కాలనీ, కాకతీయ డిగ్రీ కాలేజీ హైద్రాబాద్ రోడ్డు, కాకతీయ డిగ్రీ, పిజి కాలేజీ చర్లపల్లి, ఎస్‌ఆర్‌టిఐఎస్‌టి సెంటర్ -ఏ ఎస్‌ఎల్‌బిసి, ఎస్‌ఆర్‌టిఐఎస్‌టి సెంటర్ -బి ఎస్‌ఎల్‌బిసి, ఎస్‌ఆర్‌టిఐఎస్‌టి సెంటర్ -సి ఎస్‌ఎల్‌బిసి, ఆర్‌ఈసి సెంటర్ – ఏ ఎస్‌ఎల్‌బిసి, ఆర్‌ఈసి సెంటర్ -బి ఎస్‌ఎల్‌బిసి, నల్గొండ డిగ్రీ కాలేజీ ఆఫ్ ఆర్ట్ ఆండ్ సైన్స్ క్లాక్‌టవర్, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ శాంతి నగర్‌లో నిర్వహిస్తున్నారు.