Home జాతీయ వార్తలు సిక్కిం సిఎంగా ప్రేమ్‌సింగ్ త‌మాంగ్ ప్రమాణం

సిక్కిం సిఎంగా ప్రేమ్‌సింగ్ త‌మాంగ్ ప్రమాణం

Prem Singh Tamangగ్యాంగ్ టక్  : సిక్కిం ఆరో సిఎంగా ప్రేమ్‌సింగ్ త‌మాంగ్ (51) సోమవారం ఉదయం ప్ర‌మాణ స్వీకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ గంగా ప్ర‌సాద్ ప్రేమ్ సింగ్  చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. తమాంగ్ తో పాటు 11 మంది ఎంఎల్ఎలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.  గ్యాంగ్‌ట‌క్‌లోని ప‌ల్జోర్ స్టేడియంలో సిఎం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. సిక్కిం క్రాంతికారి మోర్చా అభిమానులు , మద్ధతుదారులు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చారు.  త‌మాంగ్ నేపాలీ భాష‌లో ప్ర‌మాణ స్వీకారం చేశారు. సిక్కిం అసెంబ్లీలో మొత్తం 32 స్థానాలు ఉన్నాయి. ఎస్ కెఎం, ఎస్ టి ఎఫ్‌ పార్టీలు ఎన్నికల్లో హోరాహోరీ పోరుకు పాల్పడ్డాయి. అయితే  గురువారం అర్ధరాత్రి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఎస్ కెఎం 17 స్థానాల్లో విజయం సాధించింది. ఎస్ టి ఎఫ్‌ 15 స్థానాలతో సరిపెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్ టిఎఫ్ గెలుస్తుందని పలువురు అంచనా వేశారు. కానీ ఎస్ కెఎం విజయం సాధించడంతో పరిశీలకుల అంచనాలు తప్పాయి. గతంలో తమాంగ్ ప్రభుత్వ టీచర్ గా పని చేశారు. 24 ఏళ్ల తరువాత ఎస్ కెఎం తక్కువ మెజార్టీతో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.

Prem Singh Tamang Sworn As Sikkim CM On Moday