Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె

Premier Explosive Company Contract workers strike

యాదాద్రి: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తు మండలంలోని పెద్ద కందుకూర్ గ్రామ పరిధిలో గల ప్రీమియర్ ఎక్స్‌ఫ్లోజివ్ కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న యాజమాన్యం కార్మికుల పట్ల మొండి వైఖరిని వహిస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అన్నారు. సోమవారం రోజుకి కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరుకున్న సందర్భంగా యాజమాన్యం మొండి వైఖరిని నశించాలని కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేసి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం రోజున లేబర్ ఆఫీసులో జరుగు చర్చలో యాజమాన్యం పాల్గొన్ని కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బబ్బూరి పోశెట్టి, బీమగాని రాములు, నరేష్,నర్సింహులు, కవిత, బాలామణి, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments