Search
Wednesday 14 November 2018
  • :
  • :

‘భారతీయుడు-2’కు సన్నాహాలు

kamal

పద్మశ్రీ కమల్‌హాసన్ ఇటీవల తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సినిమాలకు కాస్త దూరమయ్యాడు. అయితే తాజాగా కమల్ ఓ సినిమా తీసేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. సూపర్‌హిట్ మూవీ ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు-2’ను తీసేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది చివరలో పట్టాలెక్కించాలని కమల్‌హాసన్ భావిస్తున్నాడు. ఈ మేరకు శంకర్‌తో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. దేశంలో ఉన్న అవినీతిని ఇందులో చూపించి దానికి పరిష్కారాన్ని చూపించేలా కథను రూపొందించాలని దర్శకుడు శంకర్‌ను కమల్ కోరినట్టు తెలిసింది. ‘భారతీయుడు-2’ సినిమాలో దేశంలోని తాజ రాజకీయ వ్యవస్థ గురించి వివరిస్తూనే…  సామాన్యులు రాజకీయాల్లోకి వచ్చేలా మెసేజ్ ఇవ్వాలని కమల్ భావిస్తున్నట్టు తెలిసింది. ఈ భారతీయుడు-2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తుందని… దీన్ని 2019లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు కమల్ తెలిపారు.

Comments

comments